Link copied!
Sign in / Sign up
51
Shares

మీ అందాన్ని పెంచడానికి, జుట్టు రాలకుండా మెంతులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు..

మెంతులు ప్రతి ఇంట్లో సాధారణంగా ఉంటాయి. వంటల్లో తరచుగా అందరూ వాడుతూనే ఉండే ఈ మెంతుల్లో అనేక ఆయుర్వేద లక్షణాలు  ఉన్నాయని అందరికి తెలియదు. మనం రోజు ఇంట్లో చూసే మెంతులు మన జుట్టుకు, చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకు మెంతులను ఎలా వాడాలో  తెలుసుకోండి…

1. చర్మానికి మెంతులు ఇలా వాడాలి

చర్మం పై ఉండే ముడతలు, మొటిమలను మెంతులతో తొలిగించవచ్చు.  ఇందుకు మీరు ఇలా చేయాలి..

ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఒక కప్ పెరుగులో నానబెట్టి. దానిని మెత్తని మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై రాసుకుని 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకొండి.

మెంతులలో ఉండే యాంటీఆక్సిడాంట్స్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. పెరుగు ముఖం పైని మృతకణాలను తొలిగిస్తుంది.

2. మొటిమలు తొలిగించడానికి

మెంతులను నీటిలో ఒక రాత్రంతా నానబెట్టండి. వాటిని 4 కప్పుల నీటిలో 15 నిమిషాల పాటు సిమ్ లో ఉంచి వేడి చేయండి. వేడి చేసిన నీటి నుండి మెంతులను వేరు చేయండి. ఈ నీరు చల్లారాక, కాటన్ వాడి ఈ నీటితో మొటిమల పై మర్దన చేయండి. మెంతులు బాక్టీరియాను తొలిగిస్తుంది, మొటిమలను పోగొడుతుంది.

3. జుట్టు రాలడం ఆపడానికి

మెంతులను కొబ్బరి నూనెలో వేసి ఆ సీసా మూతను గట్టిగా బిగించి 3 వారాల పాటు అలానే ఉంచండి. ఇప్పుడు ఈ నూనెతో తరచుగా జుట్టును మర్దన చేసుకోండి. మెంతుల ద్వారా జుట్టుకు హార్మోన్స్ అంది, జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.

4. డయాబెటీస్

మెంతులను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వలన డయాబెటిస్ ను దూరం చేయచ్చు. మెంతులు రకతంలోని చక్కర శాతాన్ని తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెంతుల వలన తగ్గుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా తేలింది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon