Link copied!
Sign in / Sign up
1
Shares

మేక పాలు మీ పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరమేనా? ఆశ్చర్యపరిచే నిజాలు!!

 

మీ బిడ్డ తల్లి పాలు మానేసిన తరువాత, ఆ కొరత తీర్చడానికి ఏదైనా బలమైన ఆహారాన్ని మీ బిడ్డకు అలవాటు చేయాలి. అందరూ సహజంగా ఆవు పాలను అందుకు ప్రత్యామ్నాయంగా పిల్లలకు ఇస్తారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆవు పాల కంటే, మేక పాలు మీ పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. మేక పాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి…

1. అధిక ప్రోటీన్లు

పిల్లలు మేక పాలు తాగిన తరువాత అవి కడుపులో చేరుకుంటాయి. పాలలోని ప్రోటీన్లు మెత్తని పెరుగులా మారుతాయి. పిల్లలకు సులువుగా అరుగుతుంది. ప్రోటీన్లు అందుతాయి. అంతేకాకుండా మేక పాలలో ఎలర్జీ కారకాలు తక్కువగా ఉంటాయి.

2. క్రొవ్వులు సులువుగా అరుగుతాయి

సహజంగా పాలలోని క్రొవ్వులు గొలుసులుగా (fatty acid chains) ఏర్పడివుంటాయి. ఆవు పాలలో గొలుసులు పెద్దవిగా ఉంటాయి. పిల్లలకు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే మేక పాలలో కొవ్వు గొలుసులు చిన్నవిగా ఉంటాయి. సులువుగా అరుగుతాయి.

3. తక్కువ లాక్టోస్

కొంత మంది పిల్లలు లాక్టోస్ కు అలెర్జిటిక్ గా ఉంటారు. ఆవు పాలలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అది పిల్లలకు ఏదైనా సమస్యకు కారణమవ్వచ్చు. కానీ మేక పాలలో లాక్టోస్ చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఏ సమస్య ఉండదు.

మేక పాలను పిల్లలకు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

1. ముందుగా మీ డాక్టర్ సలహా తీసుకోండి

2. కొంత మంది పిల్లలకు కొన్ని రకాల పాలు పడకపోవచ్చు. ముందుగా అలాంటి సమస్యలు మీ పిల్లలకు ఉన్నాయో లేదో తెలుసుకోండి.

3. ఫోలిక్ ఆసిడ్ ఉన్న మేక పాలను ఎంచుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon