Link copied!
Sign in / Sign up
42
Shares

పండ్లపై విషపూరితమైన 'వాక్స్' చాలా డేంజర్ : 2 నిముషాల్లో అది ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకోండి

ప్రతి రోజూ ఒక ఆపిల్ తింటే చాలు ఏ రోగాలు ఉండవు, డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని ఒకప్పుడు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా కాదు రోజూ ఆపిల్ తింటే ఖచ్చితంగా రోగాల బారిన పడాల్సిందే. అలాగే మిగిలిన ఫ్రూట్స్ కూడా. ఎందుకంటే మనం తీసుకుంటున్న పండ్లు ఫ్రెష్ గా ఉండేందుకు వాక్స్ ను పూతగా రాస్తున్నారు. అసలు వాక్స్ ను ఎలా గుర్తించాలి? ఎలా తొలగించాలో వివరంగా తెలుసుకోండి. అందరికీ SHARE చేయడం మర్చిపోకండి.

పండ్లపై వాక్స్ ఉందని గుర్తించాలి?

రైతులు పండించిన పండ్లు తాజాగా ఉంటాయి కానీ వ్యాపారుల దగ్గరకు, మార్కెట్ లోకి రాగానే చాలా తేడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉండేందుకు పారాఫిన్ అనే వాక్స్ ను ఉపయోగిస్తారు. ఇది విషంతో సమానమనే చెప్పొచ్చు. సాధారణంగా తేనెపట్టు నుండి తీసే హనీబీ వాక్స్,  చెట్టు సూక్ష్మక్రిముల నుండి వచ్చే సెల్లాక్ మరియు కార్నబా వాక్స్ ను పండ్లకు పూతగా ఉపయోగించాలి. ఐతే మార్కెట్ లో వీటి ధర చాలా ఎక్కువ మరియు పారాఫిన్ చాలా తక్కువ కాబట్టి పండ్లకు పూతగా వేస్తున్నారు.

వాక్స్ ఎందుకు ఉపయోగిస్తారు?

పండ్లు త్వరగా కుళ్లిపోకుండా, తాజాగా ఉండేందుకు వాక్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఐతే విషపూరితమైన పారాఫిన్ , కొవ్వొత్తులను తయారుచేసే మైనాన్ని పూతగా వాడటం వలన మన కడుపులో మంట మరియు జీర్ణ వ్యవస్థ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, అల్సర్, పేగులు దెబ్బ తినటం జరుగుతుంది. మరి, పండ్లపై ఉన్న తొక్కలు తీసి (ఆపిల్ వంటివి) తినడం వలన శరీరానికి కావాల్సిన ఫైబర్స్, పోషకాలు దూరమవుతాయి.

వాక్స్ ను పండ్లపై ఎలా తొలగించాలి?

వాక్స్ ఫ్రూట్స్ పై ఉండటం వలన చాలా ప్రమాదకరం కాబట్టి ఎలా తొలగించాలో తెలుసుకుందాం..ఎందుకంటే పిల్లలకు ఈ విషయం తెలియక డైరెక్ట్ గా తీసుకోవడం వలన ప్రమాదాలను కొని తెచ్చుకోవల్సి వస్తుంది.

గోరు వెచ్చని నీటితో కడగండి

పండ్లు తాజాగా ఉండేందుకు మార్కెట్ లో ఎంత మోసం జరుగుతున్నా పండ్లపై ఉన్న వాక్స్ ను గుర్తించి, తొలగించాలంటే ముందుగా వేడి నీటిలో కొద్దిసేపు పండ్లను ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుని తినడం వలన వాక్స్ తొలగిపోతుంది.

బేకింగ్ సోడా నిమ్మరసం

ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం మరియు మరొక స్పూన్ బేకింగ్ సోడా కలిపి అందులో పండ్లను ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని మంచి నీటితో శుభ్రం చేసుకోవడం వలన వాక్స్ తొలగిపోతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

తొక్కలు ఉండే ఫ్రూట్స్ తో వాక్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్ తో పండ్లను క్లీన్ చేసుకుని ఆ తర్వాత పేపర్ లేదా క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కుని తినడం వలన వాక్స్ సమస్య ఉండదు.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon