Link copied!
Sign in / Sign up
2
Shares

మీరు సుఖంగా నిద్రపోవడానికి ఈ 5 ఆహారాలు సహాయపడుతాయి

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. శరీరానికి కావాల్సిన నిద్రను అందిస్తే, అనేక రోగాలు మీ దరిచేరవు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వత్తిడి నిద్రను మనకు దూరం చేస్తుంది. అనేక రోగాలను దగ్గర చేస్తుంది. వీటన్నిటిని అధిగమించి సుఖమైన, గాఢమైన నిద్రను పొందాలంటే మీరు కొన్ని ఆహారాలను మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోవాలి… అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

1. అరటి పండ్లు

రోజు నిద్రపోయేముందు ఒక అరటి పండు తినడం వలన మీ శరీరం రిలాక్స్ అవుతుంది, మీకు గాఢమైన నిద్రపడుతుంది. ఇందులో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం మీ కండరాలను రిలాక్స్ చేసి, మీకు ప్రశాంతతను కలిగిస్తాయి. అరటిపండ్లలో ఉండే ట్రీప్టోఫాన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ నిద్రలేమిని తగ్గిస్తుంది.

2. సాల్మన్

సాల్మన్ చెపలో ఒమేగా 3 మరియు విటమిన్ B6 అధికంగా ఉంటాయి. ఇవి మీలోని వత్తిడిని తగ్గించి శరీరానికి ప్రశాంతతను కలిగిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ B6, మెలటోనిన్ అనే నిద్రకు సంబంధించిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు మీకు మంచి నిద్రను అందిస్తాయి. ఈ మధ్యే జరిగిన అధ్యయనాల ప్రకారం సాల్మన్ తినేవాళ్ళలో నిద్ర సమస్యలు తక్కువని తేలింది. అలాగే మీరు సరైన నిద్ర పొందటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు..

3. హెర్బల్ టీ

హెర్బల్ టీలు మీకు మంచి నిద్రను అందివ్వగలవు. మింట్, లావెండర్ లాంటి వివిధ రకాల హెర్బల్ టీలలో మెదడుకు ప్రశాంతతను కలిగించే పదార్ధాలుంటాయి. రోజు నిద్రపోయేముంది ఒక కప్పు హెర్బల్ టీ తాగడం మీ నిద్రకు చాలా మంచిది.

4. పెరుగు

నిద్రలేమి సమస్యకు ఒక కారణం శరీరంలో కాల్షియమ్ లోపించడం. శరీరంలో కాల్షియమ్ సమతుల్యంగా ఉండడం చాలా అవసరం. అందుకే పెరుగు లేదా ఇతర పాల పదార్ధాలను మీరు రోజు తినే ఆహారంలో భాగం చేసుకోండి. మీ నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.

5. తృణధాన్యాలు

రాగులు, సజ్జలు, జొన్న, ఓట్స్, గోధుమలు లాంటి తృణధాన్యాలలో  మెగ్నీషియం, క్లాసియం లాంటి మినరల్స్ ఉంటాయి, ఇవి మెదడులోని నాడుల పై ప్రభావం చూపించి ప్రశాంతతను కలిగిస్తాయి. మీకు నిద్రను కలిగిస్తాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon