Link copied!
Sign in / Sign up
9
Shares

మహిళలు రోజు చేసే ఈ 5 పనులే తమ వక్షోజాలు జారిపోవడానికి కారణాలు : తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అందమైన, బిగువైన వక్షోజాలు అందరూ మహిళలు కోరుకుంటారు. కానీ వక్షోజాలను అలా అందంగా కాపాడుకోవాలంటే ఎం చేయాలి?  మీరు రోజు చేసే అనేక పనులు మీకు తెలియకుండానే వక్షోజాలను జారిపోయేలా చేస్తాయి. ఆ పనులు మీరు చేయకుండా ఉంటే మీ వక్షోజాలు జారీపోకుండా ఉంటాయి,  అందంగా కూడా ఉంటాయి. ఆ చేయకూడని పనులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి…

1. వేగంగా బరువుతగ్గడం

చాలా మంది మహిళలు బరువు తగ్గి సన్నగా కనిపించాలనుకుంటారు. దీని కోసం తీవ్రమైన డైటింగ్, వ్యాయామాలు చేస్తారు. త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ అలా అసహజంగా, త్వరగా బరువు తగ్గడం శరీరానికి మంచిది కాదు. అంతేకాకుండా వక్షోజాలను జారిపోయేలా  కూడా చేస్తుంది.

2. అధిక బరువు

మీ శరీర భాగాలలో అధికంగా కొవ్వు పేరుకుపోయి, మీరు అధిక బరువు పెరగడం వలన మీ వక్షోజాలు జారిపోయే ప్రమాదం వుంది.  వక్షోజాలలో పేరుకుపోయిన కొవ్వు వాటి బరువును విపరీతంగా పెంచుతుంది. అవి జారిపోయితాయి.

3. సరైన బ్రా వేసుకోకపోవడం

మీ వక్షోజాలు జారిపోడానికి మరొక కారణం మీరు సరైన విధంగా లేదా సరైన బ్రాను ధరించకపోవడం. మీ సైజు కానీ బ్రాను ధరించడం వలన, అవి మీ వక్షోజాలకు సరైన సపోర్ట్ ఇవ్వవు. ఫలితంగా మీ వక్షోజాలు జారిపోతాయి.

4. కఠినమైన వ్యాయామాలు

మీరు బరువు తగ్గాలనుకుని చేసే కొన్ని కఠినతరమైన వ్యాయామాలు వక్షోజాలు జారిపోడానికి కారణమవ్వచ్చు. ఛాతి భాగంలో ఒకేసారి ఎక్కువ వత్తిడి పడేలా చేసే వ్యాయామాలు మీ బరువు తగ్గించిన, మీ వక్షోజాలను మాత్రం జారిపోయేలా చేస్తాయి. అందుకే మీరు బరువు తగ్గడం కోసం చేసే వ్యాయామాలు నిపుణుల పర్వేక్షణలో, వారి సలహా మేరకు చేయండి.

5. నీరు తాగకపోవడం

అవును మీరు రోజు శరీరానికి కావాల్సిన సరైన నీరును తీసుకుకోకపోవడం కూడా, మీ వక్షోజాలు జారిపోడానికి ఒక కారణం. శరీరానికి కావాల్సిన నీరు అందకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే వక్షోజాల చర్మంలోని కొల్లాజెన్ (collagen) సాగిపోతుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon