Link copied!
Sign in / Sign up
22
Shares

మీరు రెండవ సారి ప్రేగ్నన్ట్ అయినప్పుడు మొదటి బిడ్డను ఎలా చూసుకోవాలి

మీరు రెండవ బిడ్డను ప్లాన్ చేస్తునట్టయితే మొదటి బిడ్డ బిడ్డతో ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.  ఇప్పటి వరకు మీ మొదటి బిడ్డనే మీకు ప్రపంచం, కానీ రెండవ బిడ్డ రాగానే పరిస్థితి అంతా మారిపోతుంది. మీ మొదటి బిడ్డ మీద కేటాయించే సమయాన్నే ఇప్పుడు ఇద్దరి బిడ్డలా మీద చూపించాల్సి వస్తుంది. ఇలా చేయడం వలన మొదటి బిడ్డ కూడా కొంచెం బాధ పడే అవకాశం ఉంది. అందుకే రెండవ బిడ్డ గురించి జరగబోయే మార్పు గురించి మీ మొదటి బిడ్డను సిద్ధం చేయండి.

ఇప్పుడు రెండవ బిడ్డ పుడుతుంటే మొదటి బిడ్డను ఎలా సిద్ధం చేయాలో తెలుసుకుందాము

1. రెండవ బిడ్డ గురించి స్వయంగా మీరే చెప్పండి. ఇతరులు చెప్తే తెలుసుకోవడం కన్నా మీరు చెప్తే తెలుసుకోవడం మంచిది.

2. ఒక వేల మీ బిడ్డను పక్కనే పండబెట్టుకునే అలవాటు ఉంటె, రెండో బిడ్డ వచ్చే లోపు అలవాటు మర్చి తనకి వేరే రూములో పడకను అలవాటు చేయండి.

3. మీ బిడ్డను మానసికంగా సిద్ధం చేయండి, అలాగే కొన్ని రోజులు తన తమ్ముడో చెల్లిలో చిన్నగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పండి.

4. పిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళండి. అక్కడ వాతావరణం, పిల్లలు ఎలా ఉంటున్నారు చూసి మీ బాబు కూడా ఒక అవగాహనకు వస్తాడు.

5. పసి పిల్లల ఫోటోలు వీడియోలు వారికి చూపించి, జనరల్ గా చిన్న పిల్లలు సున్నితంగా ఉంటారని, జాగ్రత్తగా మరియు ప్రేమగా మెలగాలని చెప్పండి.

6. అలవాటు పడటానికి బాబు లేదా పాప బొమ్మలు మీరు మీ చిన్నారికి కొనివ్వండి.

7. రెండవ బిడ్డ విషయంలో మీ మొదటి బిడ్డను ఎంత వీలైతే అంత ఇన్వాల్వ్ చేయండి. ముద్దు పేరు పెట్టడం, ఉయ్యాల ఊపడం వంటివి చేయమని చెప్పడం ద్వారా పెద్ద పిల్లల్లో ప్రేమ పుడుతుంది.

రెండో బిడ్డ పుట్టిన సమయంలో మొదటి బిడ్డలో కలిగే మార్పులు, వాటిని ఎలా నివారించాలి?

1. రోజుకి కనీసం పది నిముషాలు అయినా మొదటి బిడ్డతో ఒంటరిగా గడపండి. తనని కూడా అంతే ప్రేమిస్తున్నాం అని తెలియచేయండి.

2. మీ మొదటి బిడ్డ మొదట్లో ఇంకో బిడ్డ వలన కలిగిన మార్పుని జీర్ణించుకోలేక కోపపడచ్చు కానీ అప్పుడు మీరు ఓపికగా మొత్తం వివరించండి.

3. మీ బిడ్డ అటెంషన్ కోరుకుంటుంటే ఇవ్వండి. పసి పిల్లాడిలా కొంత సమయం చూసుకోండి.

4. ఇద్దరు బిడ్డలు అన్యోన్యంగా పెరిగేలా చేయండి. మొదటి బిడ్డకు పసి కందుతో ఎలా మెలగాలో నేర్పించండి.

5. మీ బంధువులు ఫ్రెండ్స్ కొత్త బాబుని చూట్టానికి వచ్చినప్పుడు మొదటి బిడ్డతో కూడా కొంత సమయం కేటాయించమని చెప్పండి.

6. మొదటి పిల్లాడికి కావాల్సిన స్వేచ్చని ఇవ్వండి. తన అనుమతి లేకుండా బొమ్మలను లేదా ఇష్టమైన వస్తువులను రెండో బిడ్డకు ఇవ్వకండి.

7. ఇంట్లో పెద్ద పిల్లాడి వలన కలిగే ప్రయోజనాలు వివరించండి.

8.ముఖ్యంగా ఇంకో బిడ్డ పుట్టగానే నా మీ ద ప్రేమ తగ్గిపోయింది అనే భావన రాకుండా చూసుకోండి. అందుకోసం తరచూ బహుమతులు ఇవ్వడం నచ్చిన ఆహారం ఇవ్వడం వంటివి చేయండి. 

రెండవ బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ ఎప్పుడు ఒక అభద్రతా భావంతో ఉంటాడు. దానిని దూరం చేయడం తల్లిదండ్రులుగా మీ భాద్యత. అందుకు సహకరించడంతో పైన చెప్పిన విషయాలు ఉపయోగ పడతాయని ఆశిస్తున్నాము.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon