Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రెగ్నన్సీ సమయంలో టీ, కాఫీలు తాగితే కడుపులోని బిడ్డకు ఏమవుతుంది..?

టీ కాఫీలు... పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాక టీకాఫీలు తాగందే రోజు గడవదు చాలా మందికి. టీకాఫీలు మనిషి లైఫ్ లో ఓ భాగమైపోయాయి. మామూలు జనాలు అపరిమితంగా టీకాఫీలు తాగినా పెద్దగా సమస్యలు ఉండవు కాని.. గర్భిణీలు మాత్రం టీకాఫీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టీకాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది.

గర్భిణీలు దాన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే.. టీకాఫీలు అనేవి ఒకరకమైన మత్తు పదార్థాల్లాంటివి. ఎందుకంటే.. వీటిని అలవాటు చేసుకున్నవాళ్లు అంత తొందరగా మానలేరు. అందుకే గర్భిణీలు టీకాఫీల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు  తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీకాఫీలు ఎందుకు మంచివి కావంటే?

గర్భిణీల కడుపులో ఉన్న పిండాన్ని మావి అనే ఓ పొర కాపాడుతుంటుంది. అది గర్భాశయంలోపల ఉంటుది. ఆ పొర చాలా పలుచగా ఉంటుంది. ఆ పొర తల్లి తీసుకునే ఆహారంలో ఉన్న విషపదార్థాలను పిండానికి చేరకుండా ఆపివేస్తుంది. ప్రొటీన్స్, మినలర్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ ను మాత్రమే పిండానికి పంపిస్తుంది. కాని.. ఒక్కోసారి తన పరిధిని దాటి.. కొన్ని పనులను చేయలేకపోతుంది. కొన్ని రకాల విష పదార్థాలను పిండానికి చేరవేయకుండా ఆపలేకపోతుంది. దాంట్లో ముఖ్యమైనదే కెఫిన్.

కెఫిన్ ను పిండం దగ్గరకు వెళ్లకుండా ఆపలేకపోవడం వల్ల కెఫిన్ పదార్థం ధాటికి పిండం గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కెఫిన్ వల్ల బేబీ మెటబాలిజమ్ రేట్ కంట్రోల్ లో ఉండదు. దీని వల్లనే చాలా సార్లు ముందుగా డెలివరీలు కావడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం లాంటివి జరుగుతుంటాయి.

ఇక తల్లులు కూడా ఈ కెఫిన్ వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. దీని వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో మూత్ర సంబంధ సమస్యలతో బాధ పడతారు. దీని వల్ల ప్రెగ్నెన్సీ లో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కెఫిన్ లిమిట్ ఎంత?

అయితే.. కెఫిన్ అనే పదార్థం ఒక్క కాఫీలోనే కాదు టీ, చాకోలేట్, కొన్ని రకాల ట్యాబెట్లలోనూ ఉంటుంది. ఎక్కువగా తలనొప్పి, జలుబు తగ్గడం కోసం వాడే మందుల్లో ఈ కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ కెఫిన్ వల్లనే తలనొప్పి, జలుబు తగ్గిపోతుంటుంది. అందువల్ల గర్భిణీలు ఒక్క టీకాఫీలు మాత్రమే కాకుండా కెఫిన్ ఉన్నటువంటి అన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి.

అందుకే గర్భిణీలుగా ఉన్న సమయంలో ఏ వస్తువైనా తినేటప్పుడు దాని వివరాలు చదవడం మరిచిపోకండి. దాని వల్ల కెఫిన్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండొచ్చు.

అయితే.. ఈ కెఫిన్ ను లిమిట్ లో తీసుకుంటే ఎటువంటి అనార్థాలు ఉండవు. గర్భిణీలు పరిమితిలో కెఫిన్ తీసుకుంటే దాని వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కాని నష్టాలు ఉండవు. రీసెర్చ్ ప్రకారం.. రోజుకు 200 ఎంజీల కెఫిన్ సరిపోతుందట. కాకపోతే.. 200 ఎంజీలు మించితే మాత్రం గర్భిణీలను అనవసర సమస్యలు వస్తాయి.

అంటే.. ఓ రెండు కప్పుల కాఫీలో కనీసం 200 ఎంజీల కెఫిన్ ఉంటుంది. కాబట్టి.. గర్భిణీలు కెఫిన్ పరిమాణాన్ని బట్ట తీసుకోవాలి. అయితే.. గర్భిణీలు ఇంట్లో తయారు చేసిన కెఫిన్ ఉన్న వాటినే తాగడం బెస్ట్. బయట కాఫీ షాపుల్లో తాగడం ఏ మాత్రం మంచిదికాదు. బయట కాఫీ షాపుల్లో కెఫిన్ అధికంగా ఉంటుంది.

ఇక.. టీ విషయానికి వస్తే.. ఎక్కువ పాలు కలిపిన టీ తాగడం వల్ల మీకు కొంచెం రిలీఫ్ గా ఉండొచ్చు. కొంచెం శక్తి నశించినట్లు అనిపించినా.. అలసట అనిపించినా.. వెంటనే కెఫిన్ తక్కువగా ఉన్న టీని తాగితే బెటర్. టీ ఒక్కోసారి ఇన్ స్టంట్ ఎనర్జీని అందిస్తుంది.

టీకాఫీ లవర్స్ కు ఇది కొంచెం  ఇబ్బందిగానే ఉండొచ్చు. కాని.. టీకాఫీలకు బదులుగా వేరే ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను అలవాటు చేసుకుంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి సమస్యా ఉండదు. ఇటువంటి లిక్విడ్ డ్రింక్స్ అలవాటు ఉన్నవాళ్లు ఫ్రూట్ స్మూతీస్ ను ట్రై చేయడం బెస్ట్. దాని వల్ల న్యూట్రిషన్ ఫుడ్ మీ కడుపులో ఉన్న పిల్లలకు అందుతుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏమంటారు..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon