Link copied!
Sign in / Sign up
15
Shares

మీరు బిగించే పిడికిలిని బట్టి మీ వ్యక్తిత్వం గురించి సులువుగా 2 నిముషాల్లో తెలుసుకోవచ్చు

ప్రతి ఒక్కరూ తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే కుతూహలం  ఉండటం సహజమే. ఐతే కొన్నిసార్లు మనకు ఏదైనా  బాధకలిగినా, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా సంఘటన చూడగానే మన చేతి పిడికిలి ఒక్కసారిగా బిగించుకోవడం మనకు తెలియకుండానే జరుగుతుంది.  దీని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చు. ఇది చాలా వరకు నిజమేనని దీని గురించి తెలుసుకున్న వారు చెబుతున్నారు.. మరి మీరు కూడా చూడండి.

మిగతా వేళ్ళకు మీ బొటన వేలు పక్కగా ఉంటే..

తమ పక్కనున్నవారే కాదు, కొత్తవారు ఏం చెప్పినా సరే చాలా సులువుగా నమ్మివేస్తుంటారు. ఇతరులపై నమ్మకం ఎక్కువ మరియు సున్నితమైన మనస్సు, జాలి గుండె కలవారు. ఇతరుల సమస్యను తమ సమస్యగా ఫీలవుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. జాలి గుణం కలిగిన వారు కాబట్టి ఏదైనా తట్టుకోలేని సంఘటన తమ కళ్ళముందు జరుగుతుంటే ఎమోషనల్ అయిపోతారు. మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది మీ చుట్టూనే ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.

బొటన వేలిని మిగిలిన వేళ్ళపై ఉంచిన పిడికిలి..

ఎన్నెన్నో కలలు, వెంటనే సాధించాలనే పట్టుదల ఉంటుంది, ఒకటికి రెండు సార్లు గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ చివరి నిముషంలో ఎందుకే తమ నిర్ణయాన్ని విరమించుకుంటారు. క్రియేటివిటీ పనులు కాస్త ఎక్కువ. చాలా అందంగా ఉంటారు మరియు తెలివైన వారు. ఏదైనా సమస్య వస్తే ముందుండి నాయకుడిగా నడిపిస్తారు. కొందరు మిమ్మల్ని ఈ దారిలో వెళ్ళు అని తప్పుదారులను చూపిస్తుంటారు, ఐతే మీకు తెలిసిన విషయం ఏమిటంటే సమస్య మీరు కాదు, వారికి ఆ విషయాల గురించి తెలియదని.

అన్ని వేళ్ళ కింద బొటన వేలిని ఉంచి పిడికిలి బిగిస్తే..

మీముందు కొందరు అలా చేద్దాం, నేను చాలా గొప్ప అని డ్రామా చేస్తుంటారు అది మీకు నచ్చదు. అలాగే స్వతహాగా పైకి రావడానికి, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సహనం ఎక్కువ. మీ మనస్సులోని ఆలోచనలను మీతోనే ఉంచుకుంటారు, ఎవరితో పంచుకోరు. మీతో ఉన్నవారిని జోక్స్, సెటైర్స్ వేస్తూ నవ్విస్తుంటారు. మీకు ఇష్టమైన వాళ్ళతో గడపడం చాలా ఇష్టం కానీ ఆ తర్వాత మళ్ళీ ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతారు. కొన్ని విషయాలలో కాస్త బద్ధకంగా ఉంటారు.

పైన చెప్పినట్లు మీకు ఏవైనా మ్యాచ్ అయ్యి ఉంటే LIKE, COMMENT మరియు SHARE చేయగలరు.    

Image Courtesy : AWW

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon