Link copied!
Sign in / Sign up
8
Shares

మీరు మీ పిల్లలకు తప్పకుండా నేర్పించవలసిన 5 ముఖ్యమైన అలవాట్లు

మీ పిల్లలకి ఏదైనా ముఖ్యమైనది పరిచయం చేయాలంటే అది అలవాట్లు. అలవాట్లు ఒక మనిషి యొక్క  పర్సనాలిటీని తెలుపుతాయి. మీ పిల్లలు మిమల్ని స్ఫూర్తి గా తీసుకుంటూ ఉంటారు. అందువలన మీరు చేసేవాటినే మీ పిల్లలు ఫాలో అవుతారు అనే విషయాన్ని మర్చిపోకండి.  పిల్లల ముందు మీ మంచి అలవాట్లను మాత్రమే చూపించండి.

మంచి ఆహారం

చిన్నతనంలోనే మంచి ఆహారం తీసుకునే అలవాటుని పిల్లలో ఏర్పరచాలి. చిన్నతనంలోనే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించినట్లు అయితే వారు మొదటి నుండి మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇది వారిని ఫిట్ గా ఉంచటమే కాకుండా వారికి ఆరోగ్యాంగా ఉండాలనే భావనను కలిగిస్తుంది.

రోజుకి రెండు సార్లు బ్రష్ చేయించడం

చాలా మంది పెద్దవారు కూడా ఈ అలవాటుని సరిగ్గా పాటించరు. పిల్లలకి కూడా బ్రష్ చేయడం అనేది ఎంతో బద్ధకంగా అనిపిస్తుంది. బ్రష్ చేయకుండా ఉండాలని చూస్తూ ఉంటారు. అందువలన రోజుకి రెండు సార్లు అయినా బ్రష్ చేయాలని మీ ఇంట్లో రూల్ పెట్టండి. ఇది దంత సమస్యలను దూరం చేయడమే కాకుండా ఎక్కువ కాలం పళ్ళని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీ పిల్లలు రాత్రిపూట తప్పకుండ బ్రష్ చేస్కునేలా చూడండి. ముఖ్యంగా స్వీట్స్ అండ్ చాక్లేట్లు లాంటివి తిన్నపుడు.

ఫ్లోస్సింగ్

మీ పిల్లలకి నేర్పవలసిన అతి ముఖ్యమైన అలవాటులో ఇది ప్రధానమైనది. తిండి పదార్ధాలు మన పళ్ళలో ఉండిపోవడం వల్ల క్షయిస్తాయి. ఫ్లోస్సింగ్ అనేది టాటర్ పెరగకుండా కాపాడుతుంది. అంతే కాకుండా గమ్స్ ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తిన్న వెంటనే ఫ్లోస్సింగ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ కనీసం బ్రష్ చేసిన తరువాత అయినా ఫ్లోస్సింగ్ చేయాలి.

బయట ఆడుకోవటం

మీ పిల్లలు ప్రతి రోజు బయటికి వెళ్లి ఆడుకునేలా చూడండి. అలా చేసినట్లు అయితేనే వారికి సరైన వ్యాయామం చేసినట్లు ఉంటుంది మరియు స్వచ్ఛమైన గాలి తగులుతుంది. ఇంట్లోనే ఉండే పిల్లలు అనారోగ్యంగా మరియు చదువుల్లో వెనుకబడి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతే కాకుండా వారికి ఎంతో అవసరమైన విటమిన్-డి కూడా అందుతుంది.

పరిశుభ్రత

ఇది చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం,వారి దుస్తులను ఉతకడం లాంటివి అన్నమాట. పరిశుభ్రత ఒక మనిషి తనని తాను చూపించుకునే విధానాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ మరియు ఇతర జబ్బుల నుండి కూడా పిల్లలని రక్షిస్తుంది.

ఇవి ప్రతి తల్లి తన పిల్లలకు చిన్నతనంలో తప్పకుండా నేర్పించవలసిన ముఖ్యమైన అలవాట్లు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon