Link copied!
Sign in / Sign up
7
Shares

మీరు మీ భర్తతో రొమాంటిక్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి..!


రొమాన్స్, శృంగారం అనేవి రెండు వేర్వేరు అని గుర్తుపెట్టుకోండి. దాంపత్య బంధాన్ని అందంగా, ఆనందంగా ఉంచే వాటిలో అర్దమ్ చేసుకోవడం, శృంగారంలో పాల్గొనడం అనుకోవడం పొరపాటు. భర్తతో చిలిపి పనులు చేయడం, రొమాంటిక్ గా ఉండటం మరింత దగ్గరగా చేస్తాయి. మిమ్మల్ని విడిచి మీ భర్త ఉండలేడు అనేలా సహాయపడతాయి. ఐతే మీ భర్తతో మీరు రొమాంటిక్ గా ఉన్నారో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునే దానికన్నా రొమాంటిక్ గా ఉండాలంటే భర్తతో ఏం చేయాలో తెలుసుకుందాం..

కౌగిలింతలు

ఆఫీస్ నుండి లేదా ఊరి నుండి ఇంటికి వచ్చినప్పుడు గానీ బయటకు వెళ్తున్నప్పుడు మీరు మీ భర్తను ఎంతగా మిస్ అవుతున్నారో మీ ఆయనకు తెలిసేలా మీరు కౌగిలించుకునే విధానంలో మగవారికి తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. అలాగని ఏవండీ బాగున్నారా, ఎప్పుడు వచ్చారు అంటే ప్రేమ లేదని కాదు, మీకు సిగ్గు ఉండవచ్చు అదే వేరే విషయం. రొమాంటిక్ అని తెలిపే విషయాలలో ఇది ఒకటి.

ఉదయాన్నే ఇలా చేయండి

పెళ్లి అయి అత్తారింటికి వెళ్లిన తర్వాత దాదాపు ప్రతి మహిళ తన భర్త కంటే ముందుగానే నిద్రలేచి బ్రేక్ ఫాస్ట్ చేయడం, పిల్లలను స్కూల్ కు సిద్ధం చేయడం వంటివి చేస్తూనే ఉంటారు. అలాగే మీరు మీ ఆయన కంటే ముందే నిద్రలేచిన తర్వాత శుభ్రంగా ముఖం కడుక్కుని ప్రేమగా మీ ఆయన చేతికి కాఫీ అందిస్తూ ఆప్యాయంగా ముద్దు పెడితే మీ భర్తకు ఎక్కడలేని శక్తి వచ్చి ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు.

మెసేజ్ చేయండి

కొందరు గృహ లక్ష్మి (హౌస్ వైప్స్) లు ఐతే మరికొందరు మహిళలు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. భర్త ఒకచోట భార్య ఒకచోట ఉండి ఇద్దరి మధ్య కాస్త దూరాన్నే పెంచుతున్నాయి ప్రస్తుత రోజుల్లో. అందుకని భోజనం సమయంలో లేదా ఆఫీస్ లో ఫ్రీగా ఉన్నప్పుడు మీ భర్తతో ఏం చేస్తున్నారు, మీరు నాతో పాటు పక్కనే ఉంటే ఎంత బాగుండేది, నిన్న రాత్రి జరిగిన విషయాల గురించి ఇలా మాట్లాడటం వలన భర్తకు మరింత ఇష్టం కలుగుతుంది.

ఇలా పొగడాలి

మీ భర్తను మీ స్నేహితులు లేదా మీ బంధువులు గానీ పిల్లల ముందు పొగడటం చేయాలి. పొగడటం అంటే ఏదో మాటవరసకు కాదు, మీ భర్త అంటే మీకు ఎంత ఇష్టమో, మీ జీవితంలోకి మీ భర్త వచ్చిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నారు, మీ ఆయన గొప్పదనం, మంచిదనం అందరికీ తెలిసేలా పొగడాలి. ఇలా చేయడం వలన మీ ఆయన ఎంత సంతోషపడతారో మాటల్లో చెప్పలేరు. ఆ ఆనందం మీ ఆయన కళ్ళలో కనబడుతుంది.

మీరు అందంగా ఉండటమే మీ భర్తను కూడా..

భార్య భర్తతో రొమాంటిక్ గా ఉన్నారా లేదా అని చెప్పే వాటిలో ఇది ఒకటి. మీ భర్త ఇంటికి వచ్చేసరికి ఆయనకు ఇష్టమైన ఫుడ్ వండిపెట్టడం, అందంగా ముస్తాబై ఘుమాలించే స్ప్రే వేసుకుని, తలలో పువ్వులు ధరించి అందంగా ఉండటమే కాదు. మీ ఆయన మీ నుండి కోరుకునే నిజమైన రొమాన్స్ ను భర్త బలవంతం చేయకముందే భార్య సహకరిస్తే మగవారికి సంతోషం అని అంటున్నారు. 

ఈ విషయాలన్నీ మీరు మీ భర్తతో రొమాంటిక్ గా ఉన్నారో లేదో తెలుపుతాయి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon