Link copied!
Sign in / Sign up
36
Shares

మీరు మీ అత్తగారితో కలిసిపోవాల్సిన 6 సంధర్భాలు..

మీరు ప్రసవం తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. మీ భర్త కూడా మీతో పాటూ తండ్రితనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.  మీకు సంబంధించిన ప్రతి విషయం సవ్యంగా జరుగుతూ ఉంటుంది ఒక్క మీ అత్తగారి విషయంలో తప్ప. మీ అత్తగారు ఇప్పటికీ, ఈపని ఇలా చేయకూడదు, నేను వేరేలా చేసేదానిని, నాకూతురు చేసే విధంగా నువ్వు చేయలేవు వంటి వాఖ్యాలను ఎప్పుడూ అంటుంటారు. మీ అత్తగారితో మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటంటే,

విభేదాలు

మీఅత్తగారు మీకన్నా చాలా పెద్దది, ఆమె జీవితంలో చాలా అనుభవాలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఆమె మాటలు ఇవ్వాలి.  అయితే, ఆమె ప్రతిసారి మిమ్మల్ని, మీ అభిప్రాయాలతో విభేదిస్తూ ఉంటే, మిమ్మల్ని ఇతరులతో పోల్చి తక్కువ చేసినప్పుడు విభేదాలు రావచ్చు.

పాప విషయంలో కల్పించుకోవడం

సాధారణంగా అత్తలు మీకు సంబంధించిన, మీపాపకు సంబంధించిన విషయాలలో తల దూరుస్తూ ఉంటారు. వారి ఉద్దేశం ప్రకారం వారే గొప్ప తల్లులు. మీరు చేసే ప్రతి చిన్న తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటారు. మీరు మొదటసారి తల్లి అయినప్పుడు పాప/బాబు విషయంలో చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది. అయితే వాటి గురించి ఆమె ఏదైనా అంటే, మీరు ఆమె దగ్గరకు వెళ్ళి 'నేను నాపాపను చూసుకోగలను, ఒకవేళ ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని అడుగుతాను అని సున్నితంగా చెప్పండి.

కుటుంబ విలువలు, నియమాలు

ఒక్కో కుటుంబంలో ఒక్కో విధంగా కొన్ని విలువలు, నియమాలు ఉంటాయి. మీరు పెరిగిన వాతావరణం, మీభర్త పెరిగిన వాతావరణం రెండు భిన్నమైనవి కావచ్చు. మీ అత్తగారింట్లో జరిగే ప్రతి విషయం మీఅత్తకు తెలియాలని ఆమె బావిస్తూ ఉండవచ్చు. మీరు ఏదైనా చిన్న విషయం దాచిపెట్టినా ఆమె బాధపడవచ్చు. ఆమె ఇంకా తన ఆధిపత్యం జరగాలని బావిస్తూ ఉండవచ్చు. ఇలాంటి విషయాలలో విభేదాలు రాకపోవచ్చు గానీ మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

అబ్బాయిలు ఎప్పుడూ అమ్మచాటు బిడ్డలే

ఈ సంధర్భం ప్రతి మహిళకు వస్తుంది. అదేంటంటే, మీ భర్తకు మీ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ అతను మీ అత్తగారి వైపే ఉంటారు, మాట్లాడుతారు. వాళ్ళు ఎక్కువగా తల్లి చాటు బిడ్డలుగానే ఉంటారు. మీరు జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నా, అమ్మ కన్నా బాగా చూసుకోలేదనే ఒక అభిప్రాయం వారిలో ఉంటుంది. కాబట్టి, ఈ సంధర్భం మీకు బాధ కలిగించినా కూడా దీనిని కొంచెం పరిపక్వతతో ఆలోచించి సర్దుకొని పోండి.

ఏకాంతం కోసం వేచి చూడటం

అత్తగారిలో ఉండే మరో కోణం ఏంటంటే, మిమ్మల్ని, పాపను ఎప్పుడు కనిపెట్టి ఉంచడం. ఇలా చేయడం వల్ల మీకు, మీ భర్తకు ఏకాంతం లేకుండా పోతుంది. ప్రసవం జరిగిన తర్వాత మీకు మీవారికి చాలా తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసమయాన్ని కూడా మీఅత్తగారు మీకు దక్కనివ్వడం లేదనే అభిప్రాయం మీలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మీభర్తతో సమయం గడపడానికి మీరు ప్రయత్నించండి.

మీఆడపడుచుతో పోల్చడం

మీకు ఆడపడుచు ఉంటే మీఅత్తగారు ఎప్పుడూ మిమ్మల్ని ఆమెతో పోల్చుతూ ఉంటారు. మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా అలా ఉండు ఇలా ఉండు, అవసరమైతే ఆడపడుచు యొక్క సలహాను తీసుకో అని చెప్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆమె మాట  వినకపోతే చెడ్డవారిగా ముద్రపడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ సలహా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదో మీరే బేరీజు వేసుకొని మసలుకోండి.

పైసంధర్భాలలో మీ అత్తగారు మీతో విభేదించే అవకాశాలు రావచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon