Link copied!
Sign in / Sign up
20
Shares

మీరు కొత్తగా తల్లి అయ్యారా!! అయితే మీకు అందరూ చెప్తున్న 6 అబద్దాలు ఇవే

మీకు బేబీ పుట్టిన తర్వాత ఇంటికి వస్తారు. ఇక బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ వారితో  హాయిగా గడుపుదామని అనుకుంటారు. వారిని  ఎలా పెంచాలో చాలా ఆలొచనలు చేస్తూ ఉంటారు. అయితే మీకు ఈ సమయంలో చాలా మంది చాలా సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వాటిలో కొన్ని మంచివి ఉండోచ్చు, కొన్ని ఉపయోగకరం కాకపోయి ఉండచ్చు. అయితే, సాధరణంగా మీకు ఇతరులు చెప్పే కొన్ని నిజం కాని విషయాలను చూద్దాం.

పాప నిద్రపోయినప్పుడే మీరు నిద్రపోవాలి

పాప ఎప్పుడు నిద్రపోతుందో అప్పుడే మీరు కూడా నిద్రపోవాలని చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు. అది అందరి తల్లులలో మంచిది కాదు. పాప నిద్రపోయినప్పుడు పాపకు సంబందించిన వస్తువులను సర్దడం, మీ స్నేహితులను కలవడం, మీరు కాస్త ఫ్రీ అవడం వంటి పనులు ఉంటాయి. కాబట్టి పాప నిద్రపోయినప్పుడు  మీరు కూడా నిద్రపోవాలని కచ్చితంగా చెప్పలేము.

పాలు పట్టించడం సులభం

చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, మీకు పాలు పట్టించడం ఎలాగో తెలిస్తే మీకు ఎటువంటి బాధా, నొప్పి ఉండవు. కాని ఇది నిజం కాదు. ప్రతిసారి పాలు పట్టించడం ద్వారా అక్కడ మీకు బాగా నొప్పిగా ఉంటుంది, అక్కడ బొబ్బలు రావడం, చర్మం ఇబ్బందికి గురి అవ్వడం వంటివి గమనించవచ్చు. కాబట్టి పాలు పట్టించడం వల్ల కచ్చితంగా ఎంతో కొంత హర్ట్ అవుతారని చెప్పవచ్చు.

జీవితం మారిపోతుంది

చాలా మంది చెప్పే విషయాలలో బిడ్డ పుట్టిన తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అనేది కూడా ఒకటి. అయితే ఇందులో పూర్తి వాస్తవం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత మీ జీవనశైలి కొంత వరకు మారుతుంది కానీ పూర్తిగా మారదు. మీరు కొన్ని రోజులు ఇబ్బంది పడినా తిరిగి మునుపటి జీవితాన్ని ఆస్వాదిస్తారు.

సమయం తొందరగా అయిపోతుంది

మీరు బేబీని పెంచుతున్న మొదట్లో సమయం చాలా తొందరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. అయితే అందులో నిజం లేదు. సాధారణంగా సమయం అయ్యే విధంగానే మీ బిడ్డతో గడిపే సమయం అయిపోతుంది. అయితే, మీరు మీ బిడ్డతో గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆనందించండి.

మొదటి రోజులు చాలా బెస్ట్

బేబీ పెరుగుతున్న మొదటి రోజులు చాలా బెస్ట్ అని చాలా మంది  అంటుంటారు. బిడ్డను పెంచే సమయం బెస్ట్ అనిపించడంతో పాటూ బిడ్డను ఎలా పెంచాలనే ఆందోలన కూడా ఉంటుంది. బిడ్డను పెంచడం, పాలు పట్టించడం, ఎలాంటి ఆహారం తీసుకోవడం వంటి విషయాలపై కొన్ని సందేహాలు ఉంటాయి. కాబట్టి మొదటి రోజులు ఉత్తమమైనవి కావడంతో పాటూ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.

బేబిని చూస్తే అన్నీ మర్చిపోతారు

మీరు బేబీని చూస్తే అన్ని మర్చిపోతారని చాలా మంది అంటుంటారు. అయితే, మీకు రోజులో కలిగే ఇబ్బందులు, ఒత్తిడులు మీబిడ్డను చూస్తే కచ్చితంగా తొలగిపోతాయి. కానీ మీ ప్రసవ నొప్పులు, ప్రసవ సమయంలో మీరు అనుభవంచిన బాధలు అంత తొందరగా మిమ్మల్ని మర్చిపోనివ్వవు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అప్పుడు పడిన బాధలు మర్చిపోతారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon