Link copied!
Sign in / Sign up
27
Shares

మీరు కలిసి నిద్రపోయే భంగిమను బట్టి మీ దాంపత్యం గురించి తెలుసుకోవచ్చు…


నిద్ర మీకు ప్రశాంతతను ఇస్తుంది అంతేకాదు నిద్రతో ఇంకో ఉపయోగం వుంది. మీరు నిద్రపోయే పద్దతిని బట్టి, మీ వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు. మీరు మీ వీపు మీద నిద్రపోతే మీరు చాలా దైర్యవంతులని అర్ధం. అదే బోల్డ పనుకుంటే మీరు అందరితో సరదాగా ఉంటారని అర్ధం. అయితే మీ వ్యక్తిత్వం మాత్రమే కాకుండా, మీరు మీ భర్త నిద్రపోయే భంగిమను బట్టి మీ భర్త మీతో ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి…

1. స్పూన్

కేవలం 18 శాతం దంపతులు మాత్రమే ఇలా పనుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన దంపతులు. ఇలా నిద్రపోయే దంపతులలో భర్త భార్యను ఎప్పుడు కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు. భార్యను చాలా ప్రేమిస్తాడు. కానీ కొన్ని సార్లు ఆ ప్రేమ పొసెసివ్’నెస్ గా మారి మీకు ఆంక్షలు విధించచ్చు.

2. లూజ్ స్పూన్

కొత్త పెళ్ళి అయిన దంపతులు కొంత కాలానికి ఇలా పడుకుంటారు. ఇలా నిద్రపోయే దంపతులలో భర్తకు భార్య మీద అంత ప్రేమ ఉన్నా చుపించాలనుకోడు. సందర్భానుసారంగా ప్రేమను వ్యక్తం చేస్తాడు.

3. చేస్

 

ఇది స్పూనింగ్ లాంటిదే. కానీ దంపతులలో ఎవరో ఒకరు మంచానికి చివరన పడుకుని ఉంటారు. ఇంకొకరు తనను వదలకుండా హత్తుకుని నిద్రపోతారు. హత్తుకుని పనుకునే భర్త లేదా భార్య తన భాగస్వామి నుండి ప్రేమను కోరుకుంటున్నారని అర్ధం.

4. ట్యాంగెల్

ఇలా చాలా తక్కువ మంది దంపతులు నిద్రపోతారు. పెళ్ళిఅయిన కొత్తల్లో లేదా ఏదైనా ఇద్దరి మధ్య ఏదైనా భావోద్వేగ సంఘటన జరిగినప్పుడు ఇలా నిద్రపోతారు. ఇలా నిద్రపోయే దంపతులు ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఆధారపడివుంటారు.

5. లిబర్టీ లవర్స్

27 శాతం దంపతులు ఇలానే నిద్రపోతారు. ఇలా నిద్రపోయే వారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తారు. తమకంటూ కొంత సమయాన్ని, స్పేస్ ఉంచుకుంటారు. ఎప్పుడు వీరి మధ్య బంధం ఒకేలా ఉంటుంది.

6. నజిల్

భార్య భర్త చాతి మీద తల పెట్టుకుని నిద్ర పోతుంది. దాంపత్యం కొంత కాలం గడిచి పరిపక్వతకు వచ్చిన తరువాత భార్య భర్త ఇలా నిద్రపోతారు. తాము జీవితంలో ఎదురు కోవాల్సిన సమస్యలను పరిష్కరించడంలో భర్తకు భార్య తోడువుంటుంది. ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి వుంటారు.

7. స్పేస్ హాగ్
 

ఇలా నిద్రపోయే దంపతుల్లో ఎవరైతే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి పడుకుంటారో, వారు భాగస్వామి మీద అజమాయిషీ చూపిస్తారు. అన్ని విషయాలలో తమదే తుది నిర్ణయం కావాలని అనుకుంటారు. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon