Link copied!
Sign in / Sign up
18
Shares

పులిహోర : అందరికీ నచ్చేలా 5 నిముషాల్లో ఎలా చేసుకోవాలో చూడండి

దేవుళ్ళకు ఇష్టమైన ఆహరం పులిహోర. దేవుళ్ళకు మాత్రమే కాదు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సహజంగా పులిహోర అందరికి తెలిసిన వంటకమే. అయితే ఇంకాస్త రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి…

కావాల్సిన పదార్ధాలు

బియ్యం - 2 కప్పు

నూనె - 2 టేబుల్ స్పూన్స్

కరివేపాకు - 2 రెబ్బలు

పచ్చి మిరపకాయలు - 2

ఆవాలు - తగినన్ని

సెనగపప్పు - 1 టేబుల్ స్పూన్

వేరుశెనగ పప్పు - గుప్పెడు

చింతపండు (నాన బెట్టింది)

అల్లం - చిన్న ముక్కలు

పసుపు - తగినంత.

ఉప్పు - తగినంత

తయారీ విధా1. మీరు ఒకవేళ ఆవాల పొడి లేదా మిరియాల పొడి వాడాలనుకుంటే. వాటిని వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. రెండిటిలో ఏదో ఒక్కటే వాడండి.

2. నాన పెట్టిన చింతపండును గుజ్జులా చేసుకుని వాడకట్టుకోండి.

3.అన్నం మెతుకులుగా వచ్చేలా వార్చండి. వెడల్పాటి గిన్నెలో వేసి, పసుపు, ఉప్పు చల్లి చల్లారనివ్వండి. చల్లారాక పసుపు, ఉప్పును అన్నంలో కలపండి.

4. బాణలి వేడి చేసుకుని అందులో నూనె వేసి, పప్పులన్నీ వేయించుకోండి. వాటితో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. వీటిని తీసి అన్నం మీద వేసుకోండి.

5. అదే నూనెలో చింతపండు గుజ్జును మరిగించండి. దీనిని కూడా అన్నం వేసుకుని కలుపుకోండి.

6. కావాలంటే కొంచెం బెల్లాన్ని చింత పండులో కలుపుకోవచ్చు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon