Link copied!
Sign in / Sign up
1
Shares

మీరు గర్భవతి అయిన తరువాత మీ శరీరాన్ని ప్రేమించడం ఎలా?

ప్రెగ్నన్సీ టెస్ట్ మీకు అనుకూలంగా వచ్చిందా? వావ్! మీరు తల్లి కాబోతున్నారు. కానీ, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మరో కొత్త బాధ్యత స్వీకరించడానికి, శరీరాకృతిలో జరిగే మార్పులకు సిద్ధంగా ఉన్నారా? ఉంటె మీరు అదృష్టవంతులు. ఒక్క సారి అద్దంలో చూసుకోండి, ఎందుకంటే మళ్ళి మీరు ఇలా కనపడటానికి చాలా సమయం పడుతుంది.

1. ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే

ఒక్క సారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు గెలిచిన మొదటి కప్పు, అమ్మ కలిపిన కమ్మటి ముద్ద, నాన్న పెట్టిన చివాట్లు గుర్తు చేసుకోండి. మీ జీవితంలో మరొక గొప్ప అడుగు వేయబోతున్నారు, సంతోషంగా వేయండి. మీ తల్లిదండ్రులు చేసిన ప్రతి పని మీరు కూడా కొన్ని రోజులలో చేయబోతున్నారు. తల్లి అవ్వడం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయదు కానీ, కొత్త జీవితానికి, అనుభవాలకు దారి తీస్తుంది.

2. మొదటి మార్పు 

గర్భవతి అయిన తరువాత మీ జీవితంలో జరిగే మొదటి మార్పు మీ శరీరం. మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్ పట్టకపోవచ్చు, నాజూకుగా ఉన్న శరీరం కాస్త పెద్దగా అయిపోతుంది. నేను అసహ్యంగా కనపడుతున్నానా, ఇంకా సన్నగా అవ్వలేన వంటి ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తాయి. కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అందంగా ఉన్న మీరు ప్రేగ్నన్ట్ అయ్యాక మరింత అందంగా మారారంతే. కావాలంటే ఎవరినైనా అడగండి, మీరు ఎంత అందంగా అయ్యారో వాళ్లే చెప్తారు.

3. మీలో జీవం ఊపిరి పోసుకుంటుంది

మీ కడుపులో ఒక బిడ్డ జీవం పోసుకుంటుంది. ఎంత అద్భుతమైన విషయం కదా అది. అలాంటి అద్భుతాలు జరిగే సమయంలో మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వాంతులు, ఎక్కువ సార్లు బాత్రూం వెళ్ళ వలసి రావడం జారుతాయి, కానీ, మన బిడ్డ కడుపులో పెరుగుతున్నాడు అన్న ఆనందంతో పోలిస్తే ఇది ఎంత చెప్పండి?

4. బిడ్డ తర్వాతే అన్ని 

కొన్ని రోజులలోనే మీ బిడ్డ తరువాతే అన్ని అనుకుంటారు. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. స్వేచ్ఛగా, హాయిగా, నచ్చినది చేస్తున్న మీరు కొన్ని రోజులలోనే భాద్యతగా మారే సమయం వచ్చేస్తుంది. సిద్ధంగా ఉండండి. ఈ మార్పు మీలో మరింత ఆనందాన్ని నింపుతుంది, కావాలంటే మీరే చుడండి. తల్లి అవ్వడం అనేది మనిషిగా మీరు మరో ఉన్నత స్థాయికి ఎదిగడమే.

5. నియంత్రణ 

మీ రుచుల కోరికలను ఆపుకోండి, గర్భిణీ స్త్రీలు చేయవలసిన యోగ చేయండి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను తలుచుకొని హాయిగా ఉండండి. ప్రెగ్నన్సీ సమయంలో కలిగే శరీర మార్పులు సహజం మరియు తాత్కాలికం. కాన్పు తరువాత తిరిగి మీరు మాములు శరీరం పొందడానికి ఎంతో సమయం పట్టదు. కావున, ఇప్పుడు మీ శరీరాన్ని ఎలా ఉంటె అలా ప్రేమించండి. కలిగే మార్పులను కూడా ప్రేమించండి. తల్లి కాబోతున్నందుకు మరొక సారి శుభాకాంక్షలు. హ్యాపీ ప్రెగ్నన్సీ.  

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon