Link copied!
Sign in / Sign up
3
Shares

మీరు 9వ నెల ప్రెగ్నన్సీ సమయంలో తప్పకుండా చేయాల్సిన 9 పనులు


చూస్తుండగానే మీరు ప్రేగ్నన్ట్ అయ్యి 9 నెలలు గడిచిపోయింది. ఇంకా మీ బిడ్డను ప్రసవించి ఆనందంగా వడిలోకి తీసుకోవడానికి ఇంకా ఒక్క నెలే మిగిలివుంది. ఈ 9వ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి. కానీ మీరు ఈ తొమ్మిదవ నెలలో చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి…

1. స్విమ్మింగ్ పూల్

మీరు మీ దగ్గరలో వున్నా ఏదైనా స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి అందులో కాసేపు ప్రశాంతంగా గడపండి. ఈత కొట్టాల్సిన అవసరం లేదు. అలా నీళ్ళల్లో ఉండి, ప్రశాంతంగా సేద తీరండి. ఇలా చేయడం వలన మీ బరువు తగ్గిన భావన మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.

2. వేడి నీటి స్నానం

వెచ్చని నీటితో తలారా స్నానం చేయండి. మీకు ఏమైనా నొప్పులుంటే తగ్గిపోతాయి. శరీరానికి ప్రశాంతత దొరుకుతుంది. కానీ నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి, మరీ వేడి నీరు వద్దు.

3. వ్యాయామం 

మీకు ఏ విధమైన ఇబ్బంది లేకపోతే, మెల్లగా తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇవి మిమ్మల్ని ప్రసవ సమయానికి సిద్దపరుస్తాయి. మీ కటి భాగానికి బలాన్నిస్తాయి.

4. కుటుంబంతో

మీరు ఈ నెలలో చేయాల్సిన మరో ముఖ్యమైన పని, మీ కుటుంబ సభ్యులతో గడపడం. మీ కుటుంబ సభ్యులు మీకిచ్చే ధైర్యం మీకు కావాల్సిన మానసిక బలాన్ని అందిస్తుంది. అది మీకు ఈ సమయంలో చాలా అవసరం.

5. పాజిటివ్

మీరు ఈ సమయంలో ఏ విషయాన్నైనా పాజిటివ్ దృక్పధంలో చూడండి. ఎక్కువగా అలోచించి భయపడకండి. ఈ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మీకు కొంత ఆందోళనను కలగచేయవచ్చు. మీరు కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండండి.

6. పుస్తకాలు... సినిమాలు

ఈ నెలలో మీకు దొరికే ఈ కాస్త సమయంలో మీకు నచ్చిన పుస్తకాలను చదవండి, నచ్చిన సినిమాలను చూడండి. మీకు కలిగే సంతోషం మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీకు బిడ్డ పుట్టిన తరువాత ఇవన్నీ చేయడానికి సమయం ఉండదు.

7. పేరు

పుస్తకాలన్నీ తిరగేసి, గూగుల్ లో సెర్చ్ చేసి, స్నేహితులను, చుట్టాలను కనుక్కుని మీ బిడ్డకు పెట్టాల్సిన పేరును నిర్ణయించుకోండి.

8. వస్తువులు

మీ బిడ్డ వచ్చాక తనకు అనేక వస్తువులు అవసరమవుతాయి. వాటిని ముందే తీసిపెట్టుకోండి. మీకు సమయం గడిచిపోతుంది. బిడ్డ ఇంటికి వచ్చాక హడావిడిగా వస్తువుల కోసం కంగారుపడాల్సిన అవసరం ఉండదు.

9. నిద్ర

మీకు ఈ సమయంలో నిద్ర చాలా అవసరం. వీలున్నంత సేపు ప్రశాంతముగా నిద్రపోండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రసవం తేలికవుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon