మహిళలను చూడగానే మగవారికి నచ్చే 5 విషయాలు : మీరు అనుకున్నవి కాదులెండి..
మీ ఆయన పెళ్ళికాకముందు మీ గురించి ఎన్నో విషయాలు అడగకపోయినా చెప్పివుంటాడు. పెళ్ళి అయిన తరువాత, అడిగిన చెప్పరు. కానీ పెళ్ళి అయిన తరువాత కూడా మీ గురించి చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి. అది మీ ఆయనకు కూడా తెలుసు, మీలో చాలా విషయాలను గమినిస్తుంటాడు. మీలో ఆ విషయాలంటే మీ ఆయనకు చాలా ఇష్టం కూడా… కాని ఎప్పుడు మీతో చెప్పడు. ఆ విషయాలేంటో చూడండి…
1. మీ వాగుడు
ఈ రోజంతా ఎలా జరిగిందో, మీరు ఆఫీస్ లో ఏమి జరిగిందో, మీ ఫ్రెండ్ తో మీరు ఏమి మాట్లాడారో, మీరు చూసే సీరియల్ లో ఏమి జరిగిందో? ఇలా మీరు ఆపకుండా మాట్లాడం మీ ఆయనకు చాలా ఇష్టం. మీ ఆయన మీ వాయిస్ వినడానికి ఇష్టపడుతాడు. కావాలంటే మీరు కాసేపు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండండి.” ఏమయ్యింది…” అని తప్పకుండా అడుగుతాడు.
2. మీరు టెక్స్ట్ చేయడం
మీరు ఎక్కడున్నా, మీ ఆయనకు, ఉదయం నుంచి రాత్రి ఏదో ఒక మెసేజ్ పెడుతూనే వుంటారు కదా. అది మీ ఆయనకు చాలా ఇష్టం. మీరు తనకు మెసేజ్ చేసి, తన బాగోగుల గురించి అడిగి తెలుసుకోవడం, మీ నుంచి ఇది కోరుకుంటాడు కానీ చెప్పడు.
3. పొసెసివ్ నెస్
మీ ఆయన ఆఫీసులోనో లేదా తన కాలేజీలోనో ఎవరైనా అమ్మాయి గురించి చెప్పగానే, మీరు ఏమి జరిగిందా అనే ఆతృతలో అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కదూ. మా అయన నాకు మాత్రమే అని మీరు చూపించే భావన మీ ఆయనకు చాలా ఇష్టం.
4. చిన్నపిల్లలా ఉండడం
మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలా ప్రవర్తించి, గారాలు పోయినప్పుడు, “ఏమిటిది… ?” అని చిన్నగా విసుక్కున్నా. మీరు అలా చిన్నపిల్లలా ప్రవర్తించడం మీ ఆయనకు చాలా ఇష్టం.
5. తన స్నేహితులను మెచ్చుకోవడం
ఎంత కాదన్న మగవాళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వారితో సమయం గడపడానికి ఇష్టపడుతారు. మీరు ఎప్పుడైనా తన స్నేహుతులను కొంచం మెచ్చుకున్నా చాలా సంతోష పడుతాడు.
6. ఈయన మా ఆయన
ఏదైనా పెళ్ళిలోనో లేదా ఏదైనా ఫంక్షన్లోనో, మీ ఆయనను అందరికి గర్వంగా పరిచయం చేయడం మీ ఆయనకు చాలా ఇష్టం. అది మీరు తనకు ఇచ్చే గౌరవంగా భావిస్తాడు.
మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి...ఇవన్నీ నిజమా...కాదా తెలుసుకోండి
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
