Link copied!
Sign in / Sign up
46
Shares

మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ 5 రకాల వ్యక్తులను మీరు ఇష్టపడరు..!!

గర్భం దాల్చడం, బిడ్డకు జన్మను ఇవ్వడం ఒక ఎత్తయితే పిల్లలు పుట్టిన తర్వాత కంటిపై కునుకు లేకుండా కంటికి రెప్పలా చూసుకోవడం మరో ఎత్తు.  ఇటువంటి సమయంలో అందరికంటే ఎక్కువగా తల్లి మాత్రమే ఎక్కువ బాధ్యతగా ఉంటుంది, ఉండగలదు కూడా. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఈ 5 రకాల వ్యక్తులు మాత్రం తల్లికి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసుకోండి..

పిలవకుండా వచ్చే బంధువులు

పిల్లలు పుట్టిన తర్వాత కొందరు బంధువులు ముందే చెప్పకుండా వచ్చి వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటారు. చంటిబిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్న అమ్మకు ఇది అంతగా నచ్చదు. తన బిడ్డకు నిద్రలేకుండా, ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్నారని ఫీలవుతుంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే బయటకు మాత్రం చెప్పలేరు.

కాలింగ్ బెల్ కొట్టేవాళ్ళు

పాప/బాబును గదిలో ప్రశాంతంగా పడుకోబెట్టి తల్లి కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇటువంటప్పుడు ఇంటి కాలింగ్ బెల్ లేదా ఇంటి తలుపును గట్టిగా కొడుతుంటారు. తీరా వెళ్లి చూస్తే ఈ వస్తువుతీసుకోండి మేడం మంచి ఆఫర్స్ ఉన్నాయ్, డిస్కౌంట్స్ ఉన్నాయ్ అని వాళ్ళు ఉంటారు. లేదా వాటర్ ట్యాంక్ తీసుకువచ్చిన వాళ్ళు ఉండవచ్చు, చందాల కోసం వచ్చిన వారు. వాళ్ళు వచ్చినందుకు బాధ కాదు, నిద్రపోతున్న తన బిడ్డ ఏడవటం చూసి అమ్మ తట్టుకోలేదు.

భయపెట్టేవాళ్ళు

పక్కింటి పిల్లలు, బంధువుల పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన బిడ్డతో ఆడుకోకుండా వాళ్ళను భయపెట్టడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన చంటి బిడ్డలు భయంతో ఉలిక్కిపడుతూ ఉంటారు. ఇలా తన బిడ్డను భయపెట్టేవాళ్లంటే అమ్మకు కోపం వస్తుంది. కానీ అక్కడ ఉన్నది కూడా పిల్లలే కాబట్టి గట్టిగా చెప్పలేక తనలో తానే బాధపడుతుంది.

అరిచేవాళ్ళు

ఇటువంటి వాళ్ళను మీరు కూడా చూసే ఉంటారు. మీ బిడ్డను చూడటానికి వచ్చిన వాళ్ళు లేదా మీ పక్క ఇంట్లో ఉన్నవారు గానీ, సాధారణంగా మాట్లాడుతూనే ఉన్నట్లుండి గట్టిగా అరవటం, పిల్లల ముందు కేకలు వేయడం చేస్తుంటారు. నిద్రపోతున్న పిల్లలు వీళ్ళ అరుపుకి వెంటనే నిద్రలేస్తారు. వీళ్ళ మాట తీరే అంత కాబట్టి, అమ్మకు చెప్పాలని ఉన్నా గానీ చెప్పలేదు.

నిద్రపోయే భర్త

బిడ్డకు జన్మను ఇచ్చిన తల్లి తన బిడ్డే సర్వసంగా చూసుకుంటూ ఉంటే, తన భర్త బిడ్డ ఏడుస్తుంటే కూడా పట్టించుకోకుండా  హాయిగా నిద్రపోతున్నా, తన పనిలో సహాయం కూడా చేయకుంటే అమ్మకు ఇష్టం ఉండదు. అందరు భర్తలు ఇలానే ఉన్నారు అని చెప్పడం లేదు, కొందరినే అని గమనించగలరు.

తల్లి అయిన తర్వాత ఇలా మీకు ఏవైనా నచ్చని విషయాలు ఉన్నాయా..! ఉంటే COMMENT చేసి అందరితో SHARE చేసుకోండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon