Link copied!
Sign in / Sign up
2
Shares

మీకు పెళ్ళి అయిన తరువాత మీ అమ్మతో మాత్రమే చేయగల 5 పనులు

అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు... అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు.... అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. మనకు జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం. అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... 

ప్రతి అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అమ్మను చూడటానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు చేయాలని అనుకుంటుంది. అవేంటంటే,

షాపింగ్

మీకు బాగా నచ్చిన వాటిలో షాపింగ్ కూడా ఒకటీ ఉంటుంది. అంతేకాక, మీరు మీ అమ్మతో షాపింగ్ వెళ్ళాలని చాలా సార్లు అనుకొని ఉంటారు.  మీరు ఎప్పుడైతే మీ అమ్మను కలుస్తారో అప్పుడు షాపింగ్‌కు తీసుకొని వెల్తారు. ఒక్క చిన్న వస్తువైనా కొని సంతోషపడతారు.

ఆహారం

మీరు ఎన్ని చోట్ల ఆహారం తిన్నా మీఅమ్మను మరిపించేలా ఆహారం ఎక్కడా ఉండదు అని అపిస్తుంది. అందుకే మీరు మీఅమ్మను ఎప్పుడు కలిసినా ఆమె చేతి రుచి తప్పకుండా చూస్తారు.

వంట చేయడం

మీరు మీ అమ్మతో బాగా మాట్లాడే సమయం వంటిల్లు అని చెప్పవచ్చు. అక్కడ మీరు ఊర్చున్నప్పుడు మీ అమ్మ మీకు చాలా స్టోరీస్ చెప్తూ మిమ్మల్ని సంతొషపరుస్తూ, మీకు కావల్సిన వంటకాలను మీకోసం చేస్తారు.

గాసిప్స్

మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు అన్ని విషయాలూ చెప్తుంది. మీ పక్కింటి వాళ్ళు ఏమి చేశారు, మీ ఎదురింటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వంటి అనేక విషయాలు చెప్తూ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

నచ్చిన రెస్టారెంట్

చాలా మంది తమ చిన్నప్పుడు అమ్మతో కలిసి ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా మీరు మీ అమ్మతో రెస్టారెంట్‌కు వెళ్ళాలని అనుకుంటారు. ఆ రెస్టారెంట్‌తో మీకు ఎదో తెలియని అనుబంధం ఏర్పడి ఉంటుంది.

చిన్నప్పటి జ్ఞాపకాలు

మీరు పెళ్ళి అయిన తర్వాత మీ ఇంటీకి వెళ్ళినప్పుడు మీ చిన్న నాటి సంగతులు గుర్తుకు వస్తాయి. మీ అమ్మతో కలిసి మీరు చినంప్పటీ విషయాలను చర్చిస్తూ ఆనందపడతారు.

సీరియల్స్

మీరు సీరియల్స్ చూడటం మీ అమ్మ నుండే అలవర్చుకొని ఉంటారు. ఇప్పుడు కూడా మీరు మీ అమ్మతో కలిసి సీరియల్స్ చూస్తూ ఉండటాన్ని చాలా ఆస్వాదిస్తారు.

రిలాక్స్ అవడం

మీ పుట్టింటికి రావడం అంటే, కేవలం మీ అమ్మను మాత్రమే చూడటం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. పెళ్ళి కాకముందు ఉండిన స్వేచ్చను కొన్ని రోజులు అనుభవించాలని అనుకుంటారు.

అమ్మ

ఇవన్ని పోనూ మిగిలినది అమ్మ. మీరు పైవన్ని చేయడంతో పాటు మీ అమ్మతో సమయం గడపాలని, మీ అమ్మ సహచర్యాన్ని, ప్రేమను ఆస్వాదించాలని అనుకుంటారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon