Link copied!
Sign in / Sign up
54
Shares

మీకు నార్మల్ డెలివరీ జరగాలంటే ఈ 8 చిట్కాలు పాటించండి

ప్రెగ్నన్సీతో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది నార్మల్ డెలివరీ జరగాలనే. ఎందుకంటే నార్మల్ డెలివరీ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసవం తరువాత ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు, త్వరగా కోలుకుంటాం. ఇంకా ఎన్నో…. కానీ ఈ మధ్య చాల మందికి నార్మల్ డెలివరీ లు ఎందుకు జరగడం లేదు? కొంతమందిలో వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు లేదా కడుపులో బిడ్డ అడ్డం తిరగడం లాంటివి జరిగినప్పుడు తప్పకుండా సిజేరియన్ చేయించుకోవలసి వస్తుంది. సహజంగా స్త్రీ శరీరం నార్మల్ డెలివరీ జరిగే విధంగా నిర్మించబడివుంటుంది. కానీ మనం చేయాల్సింది కూడా కొంత ఉంటుంది. ఈ కింది చిట్కాలు పాటించడం వలన నార్మల్ డెలివరీ జరిగే అవకాశం పెరుగుతుంది.

1.ప్రీ నాటల్ ఎడ్యుకేషన్ (Prenatal Education)

నార్మల్ డెలివరీ అప్పుడు ఏమి జరుగుతుంది? ఎంత నొప్పిగా ఉంటుంది? నొప్పిని భరించడానికి పాటించాల్సిన పద్ధతులు ఏంటి? ఇలా ప్రసవం గురించి పూర్తి వివరాలను గర్భంతో ఉన్నపుడే తెలుసుకోడాన్ని ప్రీ నాటల్ ఎడ్యుకేషన్ (Prenatal Education) అంటారు. ఇప్పుడు కొన్ని సిటీస్ లో ప్రీ నాటల్ ఎడ్యుకేషన్ తరగతులు జరుగుతున్నాయి. వీలుంటే వెళ్ళండి. లేదా మీరంతట మీరే ప్రసవం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ తో మీకున్న అనుమాలను అడిగి తెలుసుకోండి. డెలివరీ గురించి అందుబాటులో వుండే పుస్తకాలను చదవండి. ప్రసవం గురించి అన్ని తెలుసుకోవడం మిమ్మల్ని నార్మల్ డెలివరీకి సిద్ధపరుస్తుంది.

2.వ్యాయామం

నార్మల్ డెలివరీ జరగడానికి, కటి కండరాలు (pelvic muscle), తొడ కండరాలు ధృడంగా ఉండాలి. మీరు వ్యాయామం చేయడం వలన అవి బలంగా తయారవుతాయి. కానీ మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందు డాక్టర్ ను సంప్రదించండి. కడుపులో బిడ్డ మీద వత్తిడి పడకుండా తేలిక పాటి వ్యాయామాలు మాత్రమే ఎంచుకోండి. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

3.పోషక విలువలతో కూడిన ఆహారం

మీరు తీసుకునే ఆహారం మీ డెలివరీని సిజేరియన్ నుంచి నార్మల్ కు మారుస్తుంది. పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటె మీకు నార్మల్ డెలివరీ జరిగే అవకాశం పెరుగుతుంది. ఎక్కువ నీరు తీసుకోండి, మిమ్మల్ని కడుపులో బిడ్డను హైడ్రాటెడ్ గా ఉంచుతుంది. ఆకు కూరలు, కూరగాయలు , తాజా పండ్లు మీరు రోజు తినే ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోండి. ఇవన్నీ మీకు నార్మల్ డెలివరీ జరిగే అవకాశాన్ని పెంచుతాయి.

 4.వత్తిడికి దూరంగా ఉండండి

గర్భంతో వున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. వత్తిడికి గురవడం, ఆందోళన పడడం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మీకు ఉల్లాసాన్ని ఇచ్చే పుస్తకాలు చదవండి, మీ ఆయనతో లేదా మీ స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పండి. మీకు వత్తిడి కలిగించే వ్యక్తుల నుంచి, విషయాల నుంచి పూర్తి దూరంగా ఉండండి. వత్తిడి కి దూరంగా ఉండడం నార్మల్ డెలివరీ జరగడానికి చాలా అవసరం.

5. బ్రీతింగ్ టెక్నిక్స్ (Breathing Techniques)

మీరు శ్వాస తీసుకునే ప్రక్రియ గర్భంతో ఉన్నపుడు మారుతుంది. మెడిటేషన్, దీర్ఘంగా ఊపిరి తీసుకొని వదలడం లాంటి శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండండి. ఇది మీరు శ్వాస తీసుకునే ప్రక్రియను నార్మల్ గా మారుస్తుంది. దీని వలన మీ శరీరంలో ఆక్సిజన్ శాతం పెరిగి , మీకు నార్మల్ డెలివరీ జరగడానికి కావలసిన శక్తి లభిస్తుంది.

6.మంచి నిద్ర

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు తప్పకుండా 8-10 గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోవాలి. మంచి నిద్ర చాలా ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. మీకు నిద్ర కలగకుండా చేసే కెఫిన్ ఉన్న కాఫీ లాంటి పానీయాలు తీసుకోకండి. మీరు ప్రశాంతగా నిద్ర పోయి ఆరోగ్యంగా ఉండడం, మీకు నార్మల్ డెలివరీ జరిగే అవకాశాలను చాలా వరకు పెంచుతుంది.

7.మంచి డాక్టర్ ను ఎంచుకోండి

మీకు నార్మల్ డెలివరీ జరగడానికి కారణమయ్యే చాలా అంశాల్లో మీరు ఎంచుకున్న డాక్టర్ కూడా ఒకటి. మీరు అన్ని విషయాలు చెప్పకలిగిన, మీ అనుమానాలన్నీ అడిగి తెలుసుకోకలిగిన డాక్టర్ ను ఎంచుకోండి. మీరు డాక్టర్ తో సౌకర్యవంతంగా ఉన్నపుడు నార్మల్ డెలివరీ జరగడానికి అవకాశాలు పెరుగుతాయి. వీలున్నంత వరకు మీ కుటుంబం లోని వారు ఎవరి దగ్గరకు వెళ్తుంటారో వారినే మీరు కూడా ఎంచుకోండి.

8.డెలివరీ గురించి భయపెట్టే విషయాలు వినకండి

చాలా మంది నార్మల్ డెలివరీ జరిగే అవకాశం ఉన్నా, సిజేరియన్ ఎంచుకోడానికి కారణం ఇదే. నార్మల్ డెలివరీ లో నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయని, ఎక్కువ బాధపడాల్సి ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి. అసలు అలాంటి విషయాలు వినకండి. అందరికి నార్మల్ డెలివరీ ఒకేలా జరగకపోవచ్చు. నార్మల్ డెలివరీ జరగడానికి మీకు కావలసిన మానసిక బలాన్ని ఇవన్నీ దెబ్బతీస్తాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon