Link copied!
Sign in / Sign up
1
Shares

మీ యోని సైజు పెద్దదైతే ఎక్కువ సేపు భావప్రాప్తిని పొందగలరా? : యోని సైజు గురించి నిజాలు తెలుసుకోండి…


మహిళలకు తమ శరీరం గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. తప్పక తెలుసుకోవాలి కూడా, తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి అది చాలా అవసరం కూడా. తమ శరీర అవయువాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.అన్నిటికి గురించి అందరూ చెప్తారు, కానీ కొన్ని విషయాలలో అనేక కారణాల వలన ఎవరితో ఏమి పంచుకోము. అందులో యోని గురించినవైతే అసలు చర్చించాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఏది బయటకు చెప్పుకోకుండా అలానే ఉండిపోతాం. కానీ ప్రతి మహిళకు దాని గురించిన విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా యోని సైజు, శృంగారం, భావ ప్రాప్తి గురించి తెలుసుకోవాలనుకుంటారు…. నిజంగా మీ యోని సైజు మీ భావప్రాప్తి మీద ప్రభావం చూపిస్తుందో లేదో ఇక్కడ తెలుసుకోండి….

యోని నిర్మాణం :

యోని ఒక పొడవైన కండరాల గొట్టం. ఇది మీ గర్భాశయానికి ద్వారంగా ఉంటుంది. దీనికి సాగే గుణం ఉంటుంది. అవసరానుగుణంగా సాగుతుంది. శృంగార సమయంలో యోని ద్రవాలు స్రవిస్తాయి. అవి శృంగార సమయంలో అంగ కదలికలను సులభం చేస్తుంది. యోని బయట పైన ఉండే చిన్న బొడిపి ఉంటుంది, దీనినే క్లిటోరిస్ అంటారు. ఇది శృంగార సమయంలో భావప్రాప్తిని కలిగిస్తుంది.

యోని సైజు :

మహిళలు ఎంత విభిన్నంగా వుంటారో, యోనులు కూడా అంతే. అందరివి ఒకేలా ఉండవు. భిన్న సైజుల్లో భిన్న రంగుల్లో ఉంటాయి. యోని బయట నుండి గర్భాశయాన్ని చేరుకునే వరకు ఉండే లోతును యోని సైజు గా పరిగణించ వచ్చు. సాధారణం యోని ముడుచుకుని, శృంగార సమయంలో ప్రేరేపితమై సైజు పెరుగుతుంది.

యోని సైజు భావప్రాప్తి మీద ప్రభావం చూపిస్తుందా?

ముందుగా మనం తెలుసుకోవాల్సింది భావప్రాప్తి ఎలా జరుగుతుంది? శృంగార సమయంలో యోని లో అంగం ద్వారా జరిగే రాపిడి మీలో భావప్రాప్తిని కలిగిస్తుంది. అయితే భావప్రాప్తి జరగడానికి ఇదొక్కటే మార్గం. సున్నితమైన శరీర భాగాల మీద మెల్లగా మర్దన చేయడం, రుద్దడం కూడా స్త్రీలకు భావప్రాప్తిని కలిగిస్తాయి. అలాగే యోని సైజుతో సంబంధం లేకుండా శృంగారంలో భావప్రాప్తి కలుగుతుంది. సైజు తో సంబంధం లేదు. 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon