Link copied!
Sign in / Sign up
0
Shares

మీ వక్షోజాలు పెద్దవిగా కనిపించడానికి మీరు చేయాల్సిన 5 పనులు

 

అందమైన వక్షోజాలను అందరూ కోరుకుంటారు. కానీ కొందరి మహిళలలో వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి. అనేక రకాలుగా ప్రయత్నించిన వక్షోజాలు అలానే ఉండిపోతాయి. అయితే మీ వక్షోజాలు అందంగా సౌష్టవంగా కనిపించాలంటే, మీరు చేయాల్సింది ఇదే…

1. వ్యాయామం

 

మీరు ఛాతి భాగంలో వత్తిడిపడేలా చేసే వ్యాయామాలు మీ వక్షోజాల సైజు ను పెంచుతాయి. వక్షోజాల కండరాలు సరైన వ్యాయామంతో, బలంగా దృడంగా కనిపిస్తాయి. దీని వలన మీ వక్షోజాల సైజు పెరిగినట్టుగా కనిపిస్తుంది.

2. సెక్స్

శృంగారం మీ వక్షోజాలను పెద్దవిగా చేస్తుంది. శృంగార సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మీ శరీరంలోని రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి.  వక్షోజాల కణాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు మీ వక్షోజాలు నిండుగా, పెద్దవిగా కనిపిస్తాయి.

3. ఆహరం

ఈస్ట్రోజెన్ అధికంగా కలిగిన ఆహరం మీ వక్షోజాల సైజును పెంచుతుంది. మహిళలు యుక్త వయసుకు వచ్చాక వారిలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ వక్షోజాల సైజు పెరగడానికి సహాయపడుతుంది. తరువాత కొంత కాలానికి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. క్యారట్, ఫ్లాక్స్ సీడ్స్ సొయా బీన్స్ లాంటి ఆహారాలు అధిక ఈస్ట్రోజెన్ కలిగి ఉంటాయి. ఈ ఆహరం తీసుకోవడం వలన మీ వక్షోజాల సైజు పెరుగుతుంది.

4. హార్మోన్స్

పీరియడ్స్, లేదా ప్రెగ్నన్సీ సమయంలో సహజంగానే మీ వక్షోజాలు పెద్దవిగా మారుతాయి. ఆ సమయంలో శరీరంలో అధికంగా విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్లు సహజంగానే శరీరాన్ని పెద్దవిగా చేస్తాయి.

5. సరైన భంగిమ

 

వంగిపోకుండా నిటారుగా నిల్చోవడం లేదా నిటారుగా నడవడం, లాంటివి మీ వక్షోజాలు పెద్దవిగా కనిపించేలా చేస్తాయి. మీరు సరైన భంగిమలో ఉండడం మీ వెన్ను నిటారుగా ఉండేలా చేస్తుంది. మీ వక్షోజాలు పెద్దవిగా కనిపిస్తాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon