Link copied!
Sign in / Sign up
15
Shares

మీ రొమ్ములో పాలు ఎండిపోతున్నాయి అని చెప్పడానికి 4 గుర్తులు : బిడ్డకు ఏమైనా ప్రమాదమా..!

బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత తల్లి బాధపడే సంఘటన ఏదైనా ఉందా అంటే తన బిడ్డకు పాలు ఇవ్వలేకపోతున్నానని.  ప్రెగ్నన్సీ సమయంలో సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం, ఐరన్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవడం ఒక కారణం కాగా, కొందరి మహిళలలో రొమ్ములలో పాలు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా రొమ్ము పాలు ఎండిపోతున్నాయని ఎలా తెలుసుకోవాలో చెప్పే 4 గుర్తులు ఇవే. ప్రతి తల్లికీ ఈ విషయం చేరేలా SHARE చేయండి.

రొమ్ములో పాలు ఎండిపోతున్నాయని ఎలా తెలుసుకోవాలి?

బిడ్డకు మొదటిసారి పాలు ఇచ్చేటప్పుడు కొందరిలో పాలు త్వరగా రావడం కష్టంగా ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. కొన్ని నెలల తర్వాత పాల ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. అయితే తల్లి రొమ్ములలో పాలు ఎండిపోతున్నాయని బిడ్డను బట్టి తెలుసుకోవచ్చు. శిశువు బరువు కోల్పోయి ఉంటే లేదా శిశువుకు 6 కంటే తక్కువగా డైపర్లు ఉన్న రోజులు ఉంటే పాలు ఎండిపోతున్నాయని తెలుసుకోవాలి.

మీ వక్షోజాలను బట్టి తెలుసుకోవచ్చు

తల్లి రొమ్ములో పాలు ఎండిపోతున్నాయని చెప్పే ఉత్తమమైన మార్గాలలో ఇది మొదటిది. శుభ్రంగా ఉతికిన ఒక పొడి వస్త్రాన్ని తీసుకుని వక్షోజాలపై కొన్ని నిముషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత వస్త్రాన్ని తీసివేసి రొమ్ము ముందు భాగంపై పాలు వచ్చేలా వత్తడం చేయాలి. వెంటనే పాలు డ్రాప్స్ గా కాకుండా ఎక్కువ మోతాదులో వస్తుంటే పాల ఉత్పత్తి బాగా ఉన్నట్లు.

మీ బిడ్డ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది

తల్లి రొమ్ముల నుండి పాలు తాగేటప్పుడు బాగా ఆనందంగా ఆస్వాదిస్తారు పిల్లలు. అలా కాకుండా ఒకసారి పాలు తాగిన తర్వాత మళ్ళీ రెండవసారి వెంటనే పాల కోసం ఆకలితో ఏడవడం లేదా రొమ్ముల దగ్గరకు చేరుతున్నట్లయితే మీకే తెలుస్తుంది పాల ఉత్పత్తి సరిగ్గా జరుగుతుందా లేదా అని.

మీ బేబీ డైపర్లను చెక్ చేస్తే చాలు

పాలు తీసుకున్న తర్వాత బిడ్డకు మంచి నిద్ర కలుగుతుంది. అ లాగే ఎక్కువసార్లు నిద్రలోనే పాస్ పోయడం కూడా జరుగుతుంది. పాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు బిడ్డకు ఎన్నిసార్లు డైపర్లు చేంజ్ చేసేవారు, ఇప్పుడు ఎన్నిసార్లు చేంజ్ చేస్తున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంటే కడుపులో సరైన ఆహారం, ద్రవ పదార్థం లేక మల, మూత్ర విసర్జన జరగకపోతే బిడ్డ బరువు తగ్గుతూ ఉంటుంది.

రొమ్ముల గట్టిదనం చెబుతుంది

బిడ్డకు పాలు ఇచ్చే తల్లికి మాత్రమే అర్ధమయ్యే విషయం ఇది. రొమ్ములు గట్టిగా లేదా మెత్తగా ఉంటే రొమ్ములు ఎండిపోతున్నాయో లేదో తెలుసుకోవచ్చు. పాలు ఉత్పత్తి అయ్యేటప్పుడు బిడ్డ పాలను సేవించేటప్పుడు వక్షోజాలు జారిపోకుండా గట్టిగా ఉంటాయి. అదే కిందకు జారిపోతూ ఉంటే రొమ్ములలో పాలు ఎండిపోతున్నాయని తెలుసుకోవాలి.

రొమ్ములలో పాలు ఎండిపోకుండా సరైన పోషక ఆహారం, ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే చాలు. అందరికీ SHARE చేయండి.    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon