Link copied!
Sign in / Sign up
88
Shares

మీ రాశిని బట్టి మీ బలహీనత (వీక్ నెస్) ఏంటో మీరే తెలుసుకోవచ్చు..

ఎదుటివాళ్ళు ఏదైనా చెబుతుంటే సులభంగా నమ్మటం, ఆ తర్వాత మోసపోవడం, నిన్న ఒకటి ఆలోచించి తీరా పని జరిగే సమయానికి ఆ  ఆలోచన నుండి తప్పుకోవడం,  అంటే స్థిరంగా ఉండలేకపోవడం..ఇవన్నీ జరగడానికి మీ జన్మరాశి కూడా కారణమే అని అంటున్నారు అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులు. దీనినే బలహీనత (వీక్ నెస్) అని చెబుతున్నారు. మరి మీ రాశి ప్రకారం మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి.. మీ వీక్ నెస్ ఎవరో చెప్పటం కన్నా మీకు మీరే గుర్తించండి.

మేష రాశి - ఆవేశం ఎక్కువ, అందరినీ గుడ్డిగా నమ్మటం, నమ్మిన వాళ్ళ చేతుల్లోనే మోసపోవడం.
వృషభ రాశి - ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. ఆలోచనలు బాగా ఉంటాయి, కానీ భయమే మీ పెద్ద బలహీనత.
మిధున రాశి - మొండి పట్టుదలగా ఉంటారు. నేను సాధించగలను అనే పొగరు. ఒంటరిగా ఉన్న ధైర్యవంతులు.
కర్కాటకము - ఎమోషన్స్ ఎక్కువ, సున్నితమైన మనస్సు కలిగిన వారు. విషయం చిన్నదైనా ఎక్కువ బాధపడతారు.
సింహ రాశి - అహంకారం, గర్వం ఉంటుంది. విజయం సాధించాలన్న తపన వలనే ఈ విధంగా ఉంటారు.
కన్య రాశి - చంచలమైన మనస్సు కలిగినవారు. తెలివైనవారైనా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
తుల రాశి - బద్ధకం బాగా ఉంటుంది. టైం ప్రకారం ఏది చెయ్యలేరు. ముఖ్యమైన విషయాలను మర్చిపోతూ ఉంటారు.
వృశ్చికం - చిరాకు ఎక్కువ, ముక్కుపైనే కోపం ఉంటుంది. కానీ మంచి మనస్సు కలిగిన ఉత్తములు.
ధనస్సు - ఒంటరిగా ఉంటారు, త్వరగా డిప్రెషన్ కు గురవ్వటం. ఎవరికీ ఏ విషయాలు చెప్పుకోకుండా బాధపడటం.
మకర రాశి - మనుషులకన్నా డబ్బంటేనే చాలా ఇష్టం. ఎవరినీ లెక్కచెయ్యరు. నేనే రాజు నేనే మంత్రి అనే టైప్..
కుంభ రాశి - అందరిముందు మాట్లాడటానికి ఇబ్బందిపడుతూ ఉంటారు. బంధువుల కన్నా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం.
మీనము - తనపై ఎవరన్నా జోక్స్ వేసినా, నవ్వుతూ మాట్లాడిన తట్టుకోలేరు. ఓటమిని జీర్ణించుకోలేరు.

పైన చెప్పినట్లు మీ రాశి ప్రకారం నిజమే అయితే ‘అవును’ అని, నిజం కాకపోతే ‘కాదు’ అని కామెంట్ చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon