మీ పిల్లలు వేలు చీకడం ఆపడానికి మీరు చేయాల్సిన 3 పనులు
వేలు నోట్లో పెట్టుకోవడం, దానిని చీకడం, చిన్న పిల్లలలో సహజమే. పిల్లలు రెండు ఏళ్ళ వరకు ఇలా చేయడం మాములే. పిల్లల ఎదుగుదలకు, వారు మాటలు నేర్చుకోడానికి, ఇది తోడ్పడుతుందని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే పిల్లలు రెండు ఏళ్ళు దాటి, నాలుగు ఏళ్ళు వచ్చే లోపు, ఈ అలవాటు పూర్తిగా మానేయాలి. అలా చేయకపోతే, మీరు మాన్పించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చేతుల ద్వారా కొన్ని క్రిములు, వారి శరీరంలోకి వెళ్ళి అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. అంతే కాకుండా పళ్ళు కూడా వంకర పోతాయి. పిల్లలు ఈ అలవాటు మానేయడానికి, మీరు చేయాల్సిన పనులు ఇవే....
1. సమయం తగ్గించండి
పిల్లలు ఒక్కసారిగా ఈ అలవాటును మానేయలేరు. పిల్లలుకు వేలు చీకడాన్ని, ఇంటికి మాత్రమే పరిమితం చేసి, ఆ అలవాటు సమయాన్ని తగ్గించండి. తరువాత బెడ్ రూముకి మాత్రమే పరిమితం చేసి ఆ సమయాన్ని ఇంకా తగ్గించండి.
2. బెదిరించకండి
పిల్లలుకు బెదిరింపులా, ఏ విషయం చెప్పినా, ఇంకా మొండిగా తయారవుతారు. అందుకే ఈ విషయం కూడా బెదిరింపులా చెప్పకండి. నిదానంగా చెప్పడానికి ప్రయత్నించండి. వేలు పెట్టుకున్నప్పుడు తిట్టడం కాకూండా, పెట్టుకోనప్పుడు మెచ్చుకోండి.
3. మాట్లాడండి
మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం, మానేయాలంటే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, వారితో మాట్లాడడం. వేలు నోట్లో పెట్టుకోవడం వలన, ఎలాంటి రోగాలు వస్తాయో, పళ్ళు ఎలా వంకర పోతాయో…. ఇవన్నీ అర్ధమయ్యేటట్టు చెప్పండి.
4. వెయిట్ చేయండి
కొంతమంది పిల్లలలో మీరు ఎమీ చేసినా, ఈ అలవాటు మనుకోలేరు. అలాంటప్పుడు మీరు మీ సహనాన్ని కోల్పోయి, పిల్లలని బలవంతం చేస్తే వారు ఇంకా మొండిగా మారి, ఎప్పటికి మానుకోరు.
5. ద్యాస మళ్ళించండి
పిల్లలతో కలిసి రోజు ఏదైనా వ్యాపకాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన పిల్లల ద్యాస మారుతుంది. పిల్లలకు పజ్జిల్స్ అలవాటు చేయండి. వారి చేతులు బిజీ గా ఉంటే, ఈ అలవాటు మానేస్తారు.
6. ఆయింట్మెంట్లు వద్దు
పిల్లల వేలుకు చేదుగా ఉండే క్రీమ్స్, ఆయింట్మెంట్లు పూసి బలవంతగా ఈ అలవాటు మాన్పించడానికి ప్రయత్నించదు. అది పిల్లల ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తుంది.
ఇవి కూడా చదవండి
తల్లితండ్రులు పిల్లలకు మందులు వేసేటప్పుడు చేసే 8 ప్రమాదకరమైన తప్పులు
