Link copied!
Sign in / Sign up
38
Shares

పొట్టిగా ఉన్న పిల్లలు పొడవు పెరగాలంటే తప్పక ఇవ్వాల్సిన 7 ఆహార పదార్థాలు

పిల్లలు త్వరగా ఎదగకపోయినా, ఒకే వయసున్న ఇతర పిల్లలతో పాటు ఎత్తు పెరగకపోయినా పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా పొట్టిగా ఉన్నారని క్లాస్ లో లేదా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటే ఫీలవుతారు, కొన్ని సార్లు ఏడుస్తూ ఉంటారు కూడా. మీ ఇంట్లో ఎవరైనా పొట్టిగా ఉండటం, జన్యుపరమైన  =లోపం..ఇలా కారణాలు పట్టించుకోకుండా ఈ బెస్ట్ ఫుడ్స్ ను చిన్నతనంలో మీ పిల్లలకు ఇవ్వడం వలన త్వరగా హైట్ పెరుగుతారు. అవేంటో మీరే చూడండి.

డైరీ ప్రాడక్ట్స్

డైరీ ప్రాడక్ట్ అంటే పాలు, వెన్న, పెరుగు ప్రతి రోజూ క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం వలన పిల్లలు ఎముకలు బలంగా ఉండటానికి మరియు ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. వీటిలో అధిక మోతాదులో కాల్షియం ఉండటమే ఇందుకు కారణం. మీ పిల్లలు పాలు, పెరుగు తినడానికి ఇష్టపడకపోతే బొమ్మల రూపంలో ఉండే గ్లాసులలో ఇవ్వడం వలన ఇష్టంగా తాగుతారు.

గుడ్లు

గుడ్లలో అధిక మోతాదులో ప్రోటీన్స్ ఉండటం వలన బిడ్డ ఎదుగుదలకు మరియు హైట్ పెరగడానికి సహాయపడుతుంది. చిన్నతనం నుండే ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు మరియు ఒక గ్లాస్ పాలు ఇవ్వడం వలన మీ పిల్లల శరీరంలో జరిగే మార్పులు మీరే ప్రత్యక్షంగా గమనించవచ్చు.

పాలకూర

పచ్చని ఆకు కూరలు మరియు కూరగాయలలో ఫైబర్స్, ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఎత్తు పెరిగేలా చేస్తాయి. ఐతే పిల్లలు వీటిని తినడానికి ఇష్టం చూపించరు, దూరంగా వెళ్తుంటారు కాబట్టి మీరు ఎంత బాగా వండినా వారికి ఆకర్షణగా అనిపించాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. ఉదాహరణకు ఒక ప్లేట్ లో ఉంచి ఏదైనా బొమ్మలా లేదా బాక్సులుగా ఉంచడం వలన త్వరగా తినేస్తారు. ఏది ఏమైనా పిల్లలు తినడం ముఖ్యం కదా.

ఫ్రూట్స్

తాజా పండ్లు మరియు కూరగాయలలో అధిక మోతాదులో న్యూట్రియంట్స్ మరియు మినరల్స్ ఉండటం వలన ఎముకలు బలంగా ఉండటానికి మరియు ఎత్తు త్వరగా పెరిగేందుకు సహాయపడతాయి.

చికెన్

పిల్లలకు చికెన్ లేదా మాంసపు కృత్తులు అధికంగా ఉన్న ఆహరం ఇవ్వడం వలన మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి. అలాగే శరీర ఎదుగుదల, ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఐతే మసాలా పదార్థాలు ఎక్కువగా లేకుండా ఫ్రై చేసి తినిపించడం, అందంగా, ఆకర్షణగా రుచికరంగా ఉండేలా చేస్తే ఇష్టంగా తింటారు.

ఓట్స్

ప్రతి రోజూ ఒక బౌల్ లో ఓట్స్ ను పాలతో కలిపి బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడం పిల్లలకు అలవాటు చేయాలి. ఇది ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్ గా చేసుకోవడం వలన పిల్లల శరీరం ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తూ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ ఇందుకు కారణం.

సోయా

సోయా, సోయా మిల్క్ లలో అధికంగా ప్రోటీన్స్ మరియు కాల్షియం ఉండటం వలన ఎత్తు పెరగడానికి బాగా సహకరిస్తుంది.  ఐతే కొందరు వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి పైన చెప్పుకున్న వెజిటేరియన్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటే చాలు. మీ పిల్లలు త్వరగా ఎత్తు పెరిగేలా చేసే ఈ ఆహార పదార్థాలు గురించి అందరికీ తెలిసేలా SHARE చేయండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon