Link copied!
Sign in / Sign up
7
Shares

మీ పిల్లలు సుఖంగా నిద్రపోవాలంటే ప్రతి తల్లి ఈ 5 జాగ్రత్తలు పాటించాలి

పిల్లలకైనా, పెద్దలకైనా ప్రతి రోజూ తప్పనిసరిగా 8 గంటల నిద్ర అవసరం. వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయం తగ్గుతున్నా 6 నుండి 8 గంటలు మాత్రం తప్పనిసరి. ఇక పిల్లలలో నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుంది అనేది నిజమే. పిల్లలను పెంచడంలో తల్లితండ్రులకు పిల్లలను నిద్రపుచ్చడమే అత్యంత కష్టమైన  ]పనిగా చెబుతున్నారు. ఐతే పసి వయస్సు పిల్లలను ఎలా సుఖంగా నిద్రించవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

స్నానం చేయించాలి

అప్పుడే పుట్టిన పిల్లలు లేదా రెండు నెలల పిల్లలకు ప్రతి రోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. వారానికి రెండు లేదా మూడు సార్లు స్నానం చేయిస్తే చాలు. మిగతా రోజులు గోరు వెచ్చని నీటిలో ఒక క్లాత్ ఉంచి శరీరంపై తుడవడం చేస్తే చాలు. ఇలా చేయడం వలన పిల్లలు హాయిగా నిద్రపోతారు. సాధారణంగా 3 నెలల పిల్లలు రోజుకి 14 నుండి 17 గంటల నిద్ర అవసరం.

పాలు పట్టించాలి

పిల్లలకు ఆకలి వేస్తుందని తెలుసుకోవడం తల్లికే బాగా తెలుసు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో వారికే ఎక్కువగా తెలుసు. 6 నెలల వరకు పిల్లలకు తల్లి పాలు అవసరం కాబట్టి పాలు పట్టించడం వలన పిల్లలు సుఖంగా నిద్రిస్తారు. 4 నుండి 12 పిల్లలు రోజుకి 12 నుండి 15 గంటలు నిద్రించేలా చూసుకోవాలి.

అన్నం ఇంకా..

ఆరు నెలల తర్వాత పిల్లలు మారాం చేయిస్తుంటే పాలు పట్టించాలి, లేకపోతే త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలను తినిపించడం మొదలుపెట్టాలి. అన్నంలో క్యారెట్, బెండకాయలు, బీట్ రూట్ వంటి ఆహారాలను బాగా ఉడికించి గంజిలా అయ్యేలా చూసుకుని పిల్లలకు  ఇవ్వడం వలన బాగా నిద్రపోతారు.

డైపర్స్ మారుస్తూ ఉండాలి

పిల్లలు కొన్నిసార్లు నిద్రలోనే మూత్ర, మల విసర్జన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో తడిగా ఉండటం వలన పిల్లల నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లల బట్టలు, డైపర్స్ మారుస్తూ ఉంచాలి.

ఊయల లేదా చల్ల గాలి

కొంతమంది పిల్లలకు బెడ్ పై పడుకోపెడితే త్వరగా నిద్ర రాదు. అందుకని ఊయల లేదా మీ భుజాలపై పడుకోబెట్టాలి. ఇలా చేయడం వలన త్వరగా నిద్రపోతారు. ఆ తర్వాత బెడ్ పై పడుకోబెట్టడం చేయాలి. మీరు ఉన్న రూమ్ లో ప్రత్యేకంగా పిల్లల కోసం ఏమి ఏర్పాటు చేయకపోయినా చల్లటి గాలి తగిలేలా చూసుకోవాలి.

ఆడుకోవాలి

చిన్నతనంలో మీకు పిల్లలు తప్ప మిగతావన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మీ పిల్లలు ఎప్పుడైతే నిద్రలేచి మెలకువగా ఉంటారో ఆ క్షణం వారితో ఆడుకోవడం, ఆడించడం చేయడం వలన త్వరగా అలసిపోయి  సుఖంగా నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. పిల్లలు నిద్రించడానికి ఎటువంటి మెడిసిన్స్ వాడటం మంచిది కాదు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon