Link copied!
Sign in / Sign up
0
Shares

మీ పిల్లలు పెద్దయిపోయాక ఈ 5 విషయాలను మీరు బాగా మిస్స్ అవుతారు


 మీ పిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలు గానే ఉండిపోతే బాగుండు అని మీకు చాలాసార్లు అనిపించి ఉంటుంది కదూ? మీ పిల్లలు పెరిగే కొద్దీ ఎన్ని ఏళ్ళు అసలు ఎలా గడిచిపోయాయి అని అనిపిస్తూ ఉంటుంది.

మీ పిల్లలు పెరిగే కొద్దీ వారిలో మీరు మిస్ అయ్యే 5 వాటిని చూసేద్దాం రండి.

1. వారు పడుకునే విధానం

చిన్నపుడు భలే ముద్దుగా మీ ఛాతి పైన పడుకునే వారు కదూ మీ పిల్లలు. మీ పైన తగిలే వారి శ్వాస మరియు గంటల తరబడి వారికీ ఎక్కడ నిద్ర చెడిపోతుందేమో అనే భయంలో లేవకుండా అట్టే వారిని చూస్తూ ఉండటం. ఇపుడేమో పరుగులు తీస్తూనే ఉంటారు. ఆహ్ ! వారు మల్లి చిన్న పిల్లలు గ మారిపోతే ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది కదూ.

2. వారి మొదటి అనుభవాలు

మీ పిల్లలు మిమల్ని మొదటిసారి అమ్మ అని పిలిచింది మీకు గుర్తుందా? ఎంత ఆనంద పడిఉంటారు కదూ. వారు వేసిన మొదటి అడుగు, వారికీ వచ్చిన మొదటి పన్ను మరియు వారిని మొదటి సరి స్కూల్ కి తీసుకెళ్లిన అనుభవాలు అన్ని ఏ రోజు కూడా మరచిపోలేము.

3. వారి చెయ్యి మీ చేతిలో ఉండటం

మీ శిశువు మీ చెయ్యిని మొదటి సరి పట్టుకున్న అనుభవం మీకు గుర్తుందా? అసలు ఆ సమయం లో మీకు ఎలా అనిపించి ఉంటుంది. హద్దులు లేని ఆనందం. వారి చెయ్యిని ఆలా పట్టుకుని ఎంతో దూరం నడవడం మరియు వారు ఇచ్చే చిన్ని చిన్ని కౌగిలింతలు మరియు ముద్దులు ఇచ్చే ఆనందం. కానీ ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారు కదూ.

4. వారికి తెలుసుకోవాలి అని ఉన్న ఆసక్తి

ప్రతిదాని గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారికీ సరైన సమాధానం తెలిసినపుడు వారిలో కళ్ళలో ఉన్న ఆనందం. వారితో పాటుగా మీరు కూడా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. ఈ విషయాన్నీ తలుచుకున్నపుడు కాస్త ఎక్కువ బాధ కలుగుతుంది.

5. వారి పుట్టిన రోజులు

అసలు వారు చిన్నపుడు వారికీ హ్యాపీ బర్త్డే అని పాత పాడటం మరియు బర్త్డేని పలకడం కూడా వారికీ కష్టం అని అనిపించినపుడు. కాక్స్ తయారు చేయడం వారికీ తెలియకుండా వారికీ నచ్చింది కొనివ్వడం అన్ని కూడా మరువలేని తీపి జ్ఞాపకాలు.

ఒక తల్లి లేదా తండ్రిగా ఉండటం బహుశా ఒకరి జీవితంలో అత్యంత సుసంపన్నం, ప్రకాశవంతమైన అనుభవం. ఒక మనిషిగా మన ఎదుగుదలను తెలుపుతుంది.వారిని పట్టుకుని వారిని హత్తుకోండి.వారితో ప్రేమగా ఉండండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon