Link copied!
Sign in / Sign up
17
Shares

మీ పిల్లలు క్రమ శిక్షణ తప్పకుండా వారిని అదుపులో ఉంచుకునే 6 అత్యుత్తమ మార్గాలు

పిల్లలు పుట్టగానే మా వాడు అది అవుతాడు, మా పాప ఇది సాధిస్తుంది అని పిల్లలపై కొన్ని కొన్ని విషయాలు తల్లితండ్రులు చేయడం మంచి పద్ధతిక కాదు. మీ పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారంటే అందుకు మీరు కూడా ఒక కారణమని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ పిల్లలు క్రమ శిక్షణ తప్పకుండా మీ అదుపులోనే ఉండాలంటే  ఈ పద్ధతులను తప్పక ఫాలో అవ్వండి.

చేయి ఎత్తకండి - రెబల్ గా మారుతారు

పిల్లలు అల్లరి చేయడం సహజమే. కొన్ని సార్లు ఆ అల్లరి మరీ మితిమీరుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి పేరెంట్స్ కోపం తెచ్చుకుని పిల్లలను కొట్టడానికి ముందుకు వెళ్తుంటారు. అందుకు బదులుగా వారిని దగ్గరకు తీసుకుని ఎలా చెబితే వింటారో అలా ప్రేమగా చెబుతూనే ఉండాలి. అలా కాకుండా మీరు కొట్టడం మొదలుపెడితే మా అమ్మనాన్నలు ఎప్పుడు ఇంతేనని మీపై నెగటివ్ ప్రభావం వస్తుంది మరియు వాళ్ళు రెబల్ గా మారే ప్రమాదం ఉంది.

ఆ భారం మొత్తం మీరే భరించాలి

పెద్దలు తెలిసి చేసినట్లుగా పిల్లలు వెంటనే తెలిసి ఏ తప్పులు చేయరు. వాళ్లకు ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళతారు. ఓర్పుగా ఉండాలి నాన్న, సహనం అంటే ఇది బుజ్జి అంటే వారికి తెలియవు కాబట్టి ముందే ఆ తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆ సమయంలో వారికి ఓర్పు సహనం అవసరం.

అస్సలు మెచ్చుకోకూడదు

చిన్నతనంలో పిల్లలకు మంచి చెడు ఏంటో తెలియక పోయినా ఏదైనా విషయంలో పొగిడినా, తిట్టినా, కొట్టినా చాలాకాలం పాటు గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు అమ్మ నాన్న ఇలా చేసినందుకు మెచ్చుకున్నారని, తిట్టారని పదే పదే మళ్ళీ అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక వయస్సు వచ్చాక వాళ్ళు సాధించిన దానికి ప్రశంసించడంలో తప్పు లేదు.

ఒంటరిగా వదిలి వేయకూడదు

పిల్లలను ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్లడం, వారికి దూరంగా ఉండటం చేయకూడదు. పిల్లలకు తల్లితండ్రులు దగ్గరగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలు బాగా తెలుస్తాయి. అంతే కాకుండా వారిని ఒంటరిగా వదిలి పెట్టడం వలన నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నేను వారికి అవసరం లేదేమో అనే నెగటివ్ ఫీలింగ్స్ మొదలవుతాయి.

ప్రోత్సాహం అవసరం

ఒక ఆట బాగా ఆడినప్పుడు వెంటనే వారిని బాగా ఆడావ్, ఇలానే ఎప్పుడు రాణిస్తూ ఉండాలి అని చెప్పడం వలన పిల్లలకు ధైర్యం వస్తుంది. నేను సాధించగలను అనే పాజిటివ్ ఫీలింగ్ వారికి కలుగుతుంది. గర్వించేలా ఏ పని అయినా చేయమని చెప్పాలి కానీ గర్వంగా ఉండమని చెప్పకూడదు.

ఇదే అసలైన క్రమశిక్షణ

మీ పిల్లలకు మొదటి క్రమశిక్షణ అంటే మీ కన్నా మీ పెద్దవాళ్ళను (తాతయ్య,అమ్మమ్మ,నానమ్మ) లను నిర్లక్ష్యం చేయకుండా వారితో ఎలా ఉండాలో, వారిని గౌరవించే తీరుతెన్నులు నేర్పించాలి. బాల్యంలో మీరు చెప్పే  ఈ విషయాలే మీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాయి. ఈ గౌరవం పిల్లలలో లేకపోతే వారు ఏం సాధించినా దానికి విలువ ఉండదు.

అవును నిజమే అనిపిస్తే అందరికీ తెలిసేలా SHARE చేయండి.

cover image source : Jr Ntr Instagram

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon