Link copied!
Sign in / Sign up
37
Shares

మీ పిల్లలు 'జూలై' నెలలో పుట్టారా.. అయితే ఈ 7 రహస్యాలు తప్పక తెలుసుకోండి

బిడ్డ పుట్టిన నెల, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, పుట్టిన సమయాన్ని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి హస్త రేఖల ద్వారానో లేదా జాతకచక్రం బట్టి తెలుసుకుంటూ ఉంటారు. అటువంటివాటిలో అమెరికా ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం సంవత్సరంలో ఏడవ నెల అయిన జూలైలో పుట్టిన పిల్లలు చాలా ప్రత్యేకం అని అంటున్నారు. జూలై నెలలో జన్మించిన పిల్లలలో ఎవ్వరికీ తెలియని ఈ రహస్యాలు ఉన్నాయట. అవేంటో మీరూ ఓ లుక్కెయ్యండి.. 

చాలా అందంగా ఉంటారు 

సాధారణంగా వైద్యులు చెప్పిన ప్రకారం వేసవి కాలంలో పిల్లలు జన్మించడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా బాగుంటారని, రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే జూలై నెలలో జన్మించిన పిల్లలు మిగతా పిల్లలకంటే మరింత అందంగా ఉంటారట. ఈ నెలలో పుట్టిన పిల్లల ముఖవర్ఛస్సు ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుందని వీరి పరిశోధనలో తేలింది. 

ధైర్యం ఎక్కువ 

ఇతర నెలలలో పుట్టిన నెలల ఇక్కడ పోల్చడం లేదు కానీ, జూలై నెలలో పుట్టిన పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారని, ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారని అందుకనే వారు ప్రతి విషయంలోనూ త్వరగా విజయం సాధించగలరని అంటున్నారు. ఇది జూలై నెలలో జన్మించినవారిలో ఉన్న ప్రత్యేకతలలో ఒకటని అంటున్నారు. 

ఎవరూ ఊహించని విషయాలు 

జూలై నెలలో 22 నుండి 24 తారీఖులలో జన్మించిన పిల్లలు ఎవరి ఊహకు అందని విధంగా తమ ఆలోచనలు ఉండటమే కాకుండా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారని అంటున్నారు. అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం, సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉండటం, తమతో ఉన్న వారిని కలుపుకుని వెళ్లడం వీరి లక్షణాలలో ఒకటని చెబుతున్నారు. 

ఉత్సాహంగా ఉంటారు 

జూలై నెలలో జన్మించిన పిల్లలు ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. ఇతరుల సంతోషమే తమ సంతోషంగా ఫీలవుతారు. ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తూ తోడుగా ఉంటారు. ఏ విషయమైనా సరే భయపడకుండా ఎదుర్కుంటారు మరియు చాలా స్వీట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు దరిచేరవు. 

పెరుగుదల 

సాధారణంగా సమ్మర్ లో జన్మించిన పిల్లలలో పెరుగుదల బాగా త్వరగా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటం, త్వరగా ఆరోగ్యంగా ఎత్తు పెరుగుతారు. అలాగే జులై నెలలో జన్మించిన పిల్లలు పొట్టిగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువని ఎక్కువ ఎత్తు పెరుగుతారని, పెరుగుదలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొన్ని లక్షల మందిపై సర్వే చేసి మరీ చెప్పిన విషయం. 

ఆలోచనలు 

సంవత్సరంలో ఏడవ నెల అయిన జూలై నెలలో పుట్టిన పిల్లల మేధావితనం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పని చాలా చురుకుదనంతో చేస్తారు. ఎప్పుడు ఒకే విధమైన పని చేయడం అంటే వీరికి నచ్చదు. ఏ పనిచేసినా అందులో కిక్ ఉండాలని తపనపడుతూ ఉంటారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నాసరే కూల్ గా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనికిరాని విషయాలపై వెంటనే చిరాకుపడినా మళ్ళీ వీరే వెళ్లి వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడుతారు. 

చూశారు కదా.. జూలై నెలలో పుట్టిన పిల్లల మనస్తత్వం, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో. జూలై నెలలో జన్మించిన మీ పిల్లల వ్యక్తిత్వం ఇక్కడ చెప్పుకున్న విషయాలలో ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon