Link copied!
Sign in / Sign up
4
Shares

మీ పిల్లలు ఎవరితో కలవకుండా ప్రతిదానికి భయపడుతున్నారా? జాగ్రత్త అది మానసిక వ్యాధి కావచ్చు!!

మీ పిల్లలు కొత్త వాళ్ళు లేదా మీ బంధువులే ఎత్తుకున్నా ఏడుస్తున్నారా? మీ దగ్గర కాకుండా ఇంక ఎవరి దగ్గర ఉండటం లేదా? ఆ స్వభావాన్నే ఇంగ్లీష్ లో Stranger Danger Attitude అంటారు. పసి పిల్లలు అందరి దగ్గరికి వెళ్లడం అనేది చాల ముఖ్యం. కానీ, కొంత మంది పిల్లలు తల్లిదండ్రులు కాకుండా వారే వాళ్ళు ఎత్తుకుంటే ఎదో జరుగుతుందని భయపడి ఏడుపు ద్వారా మీకు తెలియచేస్తారు.

ఇలా భయపడటం అనేది చాల మంది పిల్లల్లో చూస్తుంటాము. వాళ్ళు పెద్దవాళ్ళని చూసి మాత్రమే కాదు తోటి పిల్లలను చూసి కూడా భయపడి ఎవరితో కలవకుండా ఉంటారు. ఇది అంత మంచి లక్షణం కాదు.

సాధారణంగా 7 - 10 నెలల వయస్సు గల పిల్లలకు ఈ భయం ఎక్కువ ఉంటుంది. కానీ మెల్ల మెల్లగా చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తించడం మొదలు పెట్టాక ఈ భయం కాస్త తగ్గుతుంది. పిల్లలకు 2 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఈ భయం దాదాపు తగ్గిపోతుంది.

తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండటం సంవత్సరం వయస్సు ఉన్న పిల్లలు అస్సలు ఇష్టపడరు. అందుకే, కొంత సేపు కూడా ఇతరుల దగ్గర ఉండటానికి ఇష్టపడరు. కనీసం తాత, అవ్వల దగ్గరికి కూడా కొంత మంది పిల్లలు ఉండటానికి ఇష్టపడు. ఇది సహజమే కానీ, తల్లిదండ్రులు ఆ భయం పోగొట్టే ప్రయత్నాలు చేయాలి.

ఈ విధంగా చేస్తే మీ పిల్లలో భయం తగ్గి అందరితో హాయిగా ఉంటారు.

1. మీరు కొత్త మనిషిని పరిచయం చేసే అప్పుడు పరిస్థితులు వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.

2. కొత్త వారిని పరిచయం చేసే సమయంలో వారు సరదాగా ఆడుకునే ఒక బొమ్మ చేతిలో పెట్టండి. ఇలా చేస్తే కొత్తవారు మీదకి వెంటనే వారి ద్రుష్టి వెళ్ళదు. కాసేపటికి వారే అలవాటు పడిపోతారు.

3. కొత్త ప్రాంతం కూడా భయానికి గురికావడానికి కారణం కావచ్చు. అందువలన కొత్త చోటుకి వెళ్లే అప్పుడు పిల్లాడికి ఇష్టమైన బొమ్మ కానీ ఆహరం కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.

4. మీరు పరిచయం చేసే వాళ్ళని కొంచెం ఓపికగా ఉండమని చెప్పండి. మొదట్లోనే పిల్లలతో కోపంగా కానీ విరక్తిగా కానీ ప్రవర్తిస్తే అది పిల్లాడి మనస్సులో బలమైన చేదు ముద్ర వేసేస్తుంది.

5. చివరగా, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను విపరీతంగా నమ్ముతారు. కాబట్టి, మీరు కొత్తవారితో స్నేహంగా మెలిగితే పిల్లలు కూడా వారి దగ్గరికి వెళ్ళడానికి అంతగా భయపడరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon