Link copied!
Sign in / Sign up
6
Shares

మీ పిల్లలు ఆహరం సరిగా తినడం లేదా? అయితే ఇలా చేయండి

మారం చేసే పిల్లలకు అన్నం తినిపించడం ఎంత కష్టమైన పనో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఇద్దరు పిల్లలకు తినిపించాలంటే, అమ్మో చాలా కష్టం. మొట్టమొదట మీకు కవలలు పుట్టారు అని తెలిసినప్పుడు మీరు ఒక విధమైన ఆశ్చర్యానికి మరియు ఆనందానికి గురవుతారు. ఈ ఫీలింగ్స్ అలాగే కొనసాగుతూ ఉంటాయి. కవలలను ఎలా పెంచాలి అని మీ బంధువులను స్నేహితులను అడిగి తెలుసుకునుంటారు.

కానీ, ఎంత తెలుసుకున్నా మారం చేసే కవలలకు భోజనం తినిపించం అంత సులువు కాదు అని మీకు ఈ పాటికే అర్థం అయివుంటుంది.  కంగారుపడకండి, ఈ 5 చిట్కాలు పాటిస్తే మీ సమస్య కొంచెం తగ్గుతుంది.

1. వారిని ఆసక్తిగా ఉంచండి

మీ కవలలకు అనేక రకాల ఆహారం ఇవ్వండి. రోజుకో కొత్త ఆహారం ఇవ్వండి. ఎన్ని రకాల వంటకాలు ఉంటె అంత సులువుగా తినేస్తారు. వారిని ఒకదానికి అలవాటు చేయకుండా భోజనం మారుస్తూ ఉండండి. ఎందుకంటే, అలవాటు పడితే అదే కావాలి అని అంటారు. కొన్ని రోజులకు  అలవాటు పడిన ఆహారం బోర్ కొట్టి దానిని పూర్తిగా తినడం మానేస్తారు.

2. తినడం అనేది ఒక సరదా ప్రక్రియగా మార్చండి

ఆహారాన్ని వినోదంగా తినిపించడానికి ప్రయత్నించండి. కవలలతో, ఎవరు ముందు తినగలరు అనే పోటీని కూడా ప్రకటించగలరు మరియు మీ పిల్లలు సులభంగా మరియు వేగంగా తినడానికి ఇదే మార్గం. త్వరగా తిన్నందుకు కానుకలు ఇచ్చి ఉత్సాహపరచండి.

3. తినడాకిని ఒక టైం అంటూ కేటాయించండి

మీ పిల్లలు సరైన సమయానికి తినేయడం అలవాటు అవడానికి కొంత టైం పడుతుంది. కానీ, మీరు వారికి అలవాటు అయ్యేదాకా ఓపికగా నేర్పండి. ఒక్కసారి టైం కి తినేయడం అలవాటు అయ్యాక మీకు సగం భారం తగ్గిపోతుంది. కావున, వారికి సరైన టైములో తినేయడం అలవాటు చేయండి.

4. కలిసి భోజనం చేయండి

భోజనం కలిసి చేయడానికి ప్రయత్నించండి. ప్రతి సారి ఇలా  కుదరకపోవచ్చు, ముఖంగా మీరు మీ వారు ఉద్యోగం చేస్తుంటే. కానీ కుదిరినప్పుడల్లా కలిసి భోజనానికి కూర్చోండి. పిల్లలకి మొదటి గురువు తల్లిదండ్రులు. ఎలా తినాలో కూడా వారు మీ నుంచే నేర్చుకుంటారు. మీరు టైంకి తింటే వాళ్ళు కొన్ని రోజుల్లోనే అలవాటు చేసుకుంటారు.

5. వంట చేయడంలో పిల్లలు కూడా పాల్గొనేలా చేయండి

మీ పిల్లలను వంట పనిలో సహాయం చేయమని చెప్పండి. ఫ్రిడ్జిలో కూరగాయలు అందివ్వమనడం, టేబుల్ మీద ప్లేట్స్ పెట్టడం వంటి చిన్న చిన్న పనులను చెప్పండి. అంతేకాకుండా, ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు వారిని కూడా వెంట తీసుకొని వెళ్ళండి. ఇలా చేయడం ద్వారా వారికి తిండి మీద ఇష్టం పుట్టి మారం చేయకుండా తింటారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon