Link copied!
Sign in / Sign up
27
Shares

మీ పిల్లలతో ఈ 5 పనులు ఎప్పటికీ చేయకూడదు : ఇలా చేస్తే పిల్లలకు చాలా డేంజర్

చంటి బిడ్డలను, సంవత్సరం కూడా నిండని పిల్లలను, అనారోగ్యంగా పిల్లలతో చాలామంది తల్లితండ్రులు మరియు బంధువులు వాళ్లకు తెలియకుండా, అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది పిల్లల ఆరోగ్యానికే ప్రమాదం. కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ 5 పనులు మీరు కూడా ఎప్పటికీ చేయకండి.  అలాగే తెలియని వాళ్లకు తెలిసేలా అందరికీ SHARE చేయండి..

పైకి కిందకు ఎగరవేయటం

పిల్లలు ముద్దుగా ఉన్నారు, అందంగా ఉన్నారు, అందరి దగ్గరికీ బాగా వస్తున్నాడని ప్రేమగా ఎత్తుకుని గారాబం చేస్తూ పైకి కిందకు ఎగరవేయటం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఈ విధంగా చేయడం వలన పిల్లల మెదడుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అలాగే వారికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

ఫోటోలు తీసేటప్పుడు

పుట్టిన పిల్లలను తమ బంధువులకు చూపించడానికి, బిడ్డ జ్ఞాపకాలు పదిలంగా ఉంచడానికి తమ ఫోన్లు లేదా కెమెరాలలో బంధిస్తూ ఉంటారు. ఫోటోలు తీసే టైములో బాగా రావాలని ఫ్లాష్ ఆన్ చేయడం పసిపిల్లల కళ్లపై పడి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

ముద్దు పెట్టుకోవడం

ఎస్..ఇది చాలామంది తెలిసో తెలియకో చేస్తున్న విషయం. పసిపిల్లలను పెద్దలు ముద్దుపెట్టుకోవడంలో తప్పులేదు. పెద్దలు అనారోగ్యంగా ఉన్నప్పుడు, జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులతో, అంటువ్యాధులు ఉన్నప్పుడు వారిని తాకడం వలన వారికి అనారోగ్యాన్ని మీరే కలిగించినవారవుతారు.

పడుకోబెట్టడం

పసిపిల్లలకు ఊపిరి ఆడటం లేదని ఎంతోమంది తల్లితండ్రులు తమ బిడ్డలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారిని చూసే ఉంటారు. పిల్లలను పడుకోబెట్టే సమయంలో ఊపిరి తీసుకునే ముక్కు నోటి భాగాల దగ్గర ఎటువంటి దుస్తులు,దుప్పట్లు, దిండ్లు ఉంచకూడదు. అలాగే బెడ్ కు ముక్కు నోటిని దగ్గరగా ఉంచడం, బోర్లా పడుకోబెట్టడం వలన శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

ఆహారం

నెలల పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని తినిపించాలో చాలామంది తల్లితండ్రులు అయోమయ స్థితిలో ఉంటారు. ఇది పెడితే మంచిదా కాదా అని భయపడుతూనే కొన్నిసార్లు వాళ్ళు తినే ఆహారాలు లేదా పిల్లలకు తినిపించాల్సినవే ఎలా చేయాలో తెలియక తినిపిస్తూ ఉంటారు. అవి గట్టిగా ఉండటం లేదా గొంతులో అడ్డుపడటం వలన పిల్లల ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువ.

సో, అందుకని ఈ 5 పనులు ఎప్పటికీ చేయకండి, చేయనీకండి. ఇది అందరికీ ఉపయోగపడే విషయమని మీకు అనిపిస్తే వెంటనే SHARE చేయండి. అలాగే మీ విలువైన COMMENT ను తెలపండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon