Link copied!
Sign in / Sign up
26
Shares

మీ పిల్లలు తినడానికి మారం చేస్తున్నారా? ఈ వంటకాలు ప్రయత్నించండి


చాలా మంది పిల్లలు తినడానికి బాగా మారం చేస్తుంటారు. ఎంతో ప్రేమతో మనం క్యారీ కట్టిస్తే సాయంత్రం వచ్చేసరికి మొత్తం అలాగే ఉంటుంది. తినిపించడానికి మనం పడే కష్టం చదువు మీద పెట్టుంటే IAS పాస్ అయిపోవాళ్ళమేమో. ఎటువంటి ఆహరం పెట్టిన మీ బాబు సరిగా తినడం లేదా? ఈ ఆహారాలు ప్రయత్నించండి, ప్లేట్ కాలీ చేసెస్తాడు. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినే మరియు ఆరోగ్యకరమైన వంటలు ప్రయత్నించండి.

ఇడ్లి మరియు దోస

ఈ రెండు వంటలు నచ్చని వారంటూ ఎవరు ఉండరు. సాధారణంగా దీనిని టిఫ్ఫిన్కి చేసుకుంటాము, కానీ ఆలా కాకుండా అవసరాన్ని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిండి ఎప్పుడూ ఫ్రిడ్జిలో పెట్టుకుంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం సరిగా చేయకపోయుంటే సాయంత్రం తినిపించవచ్చు. ఇడ్లిలో ఫ్యాట్ ఉండదు, కొవ్వు పదార్థం ఉండదు కాబట్టి ఇది పిల్లలకు చాలా మంచిది. ఇది మృదువుగా ఉంటుంది కాబట్టి సులువుగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా ఇడ్లిలో క్యారట్, బీట్రూట్ సన్నగా తరిగి చేస్తే ఇంకా ఆరోగ్యంగా రుచిగా మారుతుంది.

పెరుగన్నం

పెరుగన్నం అనేది పిల్లలకు అద్భుతమైన ఆహారం. ఇది జీర్ణ శక్తిని మరియు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాకుండా తిరగబాత పెట్టడం ద్వారా పెరుగన్నం ఇంకా రుచిగా మారుతుంది. కావాలనుకుంటే పెరుగన్నంలో దానిమ్మగిజాలు వేసి మీ పిల్లలకు తినిపించండి. ఇష్టంగా తింటారు మరియు ఆరోగ్యంగా ఉంటారు.

ఉప్మా

ఉప్మా కూడా మరో రుచికరమైన వంట. ఉప్మా రవ్వలోని ఐరన్ పోషక విలువలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు ఎక్కువ వేసి ఉప్మా చేసి పిల్లలకు తినిపిస్తే మరింత రుచిగా మారుతుంది. అంతే కాకుండా, కూరగాయలలో కూడా పోషకాలు ఉంటాయి కనుక పిల్లలు దృడంగా మారుతారు.

పొంగల్

పొంగల్ని మనం తీయ్యగ చేసుకోగలం మరియు కారంగా చేసుకోగలము. పొంగల్ కోసం అని వాడే పెసరపప్పు పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం. పిల్లలకే కాదు పేదలకు కూడా అత్యంత అవసరం ఎందుకంటే ఏది శరీరానికి వేడి కలగకుండా చేసి కావాల్సిన ప్రోటీన్లు అందిస్తుంది.

పుట్టు

ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ చేసుకోము కానీ కేరళలో దీనిని బాగా  ఇష్టంగా తింటారు.  దీనిలో ఉండే పోషక విలువల కారణంగా మనం కూడా దీనిని మన పిల్లలకు పెడితే మంచిది. ఈ పుట్టని ఏదయినా పండుతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లల దీనిని ఎంతో ఇష్టంగా తింటున్నారు అని చాలా మంది తల్లులు అభిప్రాయపడుతున్నారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon