Link copied!
Sign in / Sign up
23
Shares

మీ పిల్లలలో పోషకాహారం తగ్గితే వచ్చే జబ్బులు : ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే చాలు

పిల్లలకు జన్మనివ్వడంతోనే తల్లి బాధ్యత పూర్తయినట్లు కాదు. పిల్లలు సరిగ్గా ఎదిగేలా చూసుకోవడం, వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఉండేలా జాగ్రత్త పడితేనే మంచి తల్లిగా మీ బిడ్డకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది పిల్లలలో ఎదురవుతున్న సమస్య పోషకాహార లోపం. పోషకాహారం లోపిస్తే ఎటువంటి జబ్బులు వస్తాయి? వాటి నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు తక్కువైతే వచ్చే సమస్యనే పోషకాహార లోపం అని అంటారు.  పోషకాహారం లోపిస్తే వ్యాధి  నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కాకుండా ఇక్కడ చెప్పుకునే జబ్బులు వస్తాయి. 

జుట్టు రాలడం, పెదాల పగుళ్లు

సరైన పోషక ఆహారాన్ని ముఖ్యంగా ప్రోటీన్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన చిన్న పిల్లలో  జుట్టు రాలడం,  పెదవులు పగలడం వంటి సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి.

కట్టె నంజు

దీనినే వైద్యభాషలో మెరాస్ మస్ అని అంటారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కండరాలు తగ్గిపోవడం, నీరసంగా ఉండటం, ఆకలిగా ఉన్నా ఏది తినలేకపోవడం, వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవటం.

ఉబ్బు నంజు

ఈ వ్యాధి లక్షణాలు పిల్లలలో ఎలా ఉంటాయంటే అదే బరువు కలిగి ఉండటం, చర్మంపై పగుళ్లు, పొక్కులుగా రాలటం, నీరసంగా ఉండటం,జుట్టు రంగులో మార్పు, కాళ్ళు వాపులుగా ఉండటం జరుగుతుంది.

చలాకీగా ఉండలేరు

పోషకాహారం లోపించడం వలన ఇతర పిల్లల్తో పోలిస్తే చలాకీగా ఉండలేకపోవడం, తినే తిండిపై, ఆడుకునే ఆటలపై ఆసక్తి చూపించలేక పోవడమే కాకుండా భవిష్యత్ లో కాకుండా మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ముందుగానే తీసుకోవాల్సిన నివారణ చర్యలు:
పాలిచ్చే తల్లులు

గర్భధారణ సమయంలో సరైన పోషక ఆహారం తీసుకోవడం, బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత 6 నెలల వరకు తప్పకుండా తల్లి పాలు ఇవ్వడం, అలాగే 6 నెలల తర్వాత ఘన ఆహార పదార్థాలు అలవాటు చేయడం, సరైన సమయానికి సరైన టీకాలు వేయించడం, పండ్ల పదార్థాలు, ద్రవ పదార్థాలు ఇవ్వడం చేయాలి.

కాల్షియం ఫుడ్స్

పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, వారి ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. చిన్నతనంలోనే కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు, మెదడుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

మొక్కజొన్నలు

ఎదిగే పిల్లలకు మొక్కజొన్నలను కాల్చి తినిపించడం వలన వారి దంతాలు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పిల్లలకు కడుపునొప్పిగా ఉంటే ఉడికించిన మొక్కజొన్నలు పెట్టాలి.

కిచిడి

పిల్లలు బాగా ఇష్టంగా తినే ఆహారాలలో కిచిడీ ఒకటి. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. బియ్యం, పెసరపప్పు, ఆకుకూరలు, జీలకర్రతో ఈ పదార్థాన్ని తయారుచేసి తినిపించడం వలన వారి ఎదుగుదలకు మంచిది.

ఐరన్

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం వలన వారి ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా బలంగా ఉండేలా చేస్తుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకు ఎవ్వరూ చెప్పని, ఎక్కడా వినని 5 విషయాలు

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon