Link copied!
Sign in / Sign up
7
Shares

పిల్లలలో కడుపు నొప్పికి అసలు కారణాలు ఇవే : అమ్మమ్మలకు కూడా తెలియని అద్భుత ఇంటి చిట్కాలు

పిల్లల్లో కడుపు నొప్పి అనేది అసాధారణ విషయం ఏమి కాదు. ఇది సాధారణంగా చెడిపోయిన ఆహారం,  ఒత్తిడి వంటి వివిధ కారణాల వలన సంభవిస్తుంది. చాలా వరకు దీనిని ఇంట్లో వాడే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కడుపు నొప్పిని ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవడానికి 7 చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

1. నీరు

రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం కొన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్న పద్దతి. ఈ రోజుల్లో నీటిని మనం కావాల్సినంత తీసుకోవడం లేదు, అందుకే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తగినంత నీటిని త్రాగటం శరీరాన్ని శాంతిపరుస్తుంది మరియు సులభమైన ప్రేగు కదలికలలో సహాయపడుతుంది.  సరిగ్గా శారీరక విసర్జన జరగకపోవడం చాలా మంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యని ఎక్కువ నీరు తాగడం ద్వారా నిర్మూలించవచ్చు.సోడా మరియు ఇతర రకాలైన పానీయాలు కాకుండా వీలైనంత వరకు నీరు త్రాగడానికి మీ పిల్లలని ప్రోత్సహించండి.

2. ఆటలు

ఈ రోజుల్లో పిల్లలు గ్రౌండ్ వెళ్ళి ఆదుకోవడం అనేదే తక్కువ అయిపోయింది. దీని వలన శరీరానికి కావాల్సిన వ్యాయామం అందాకా అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది కడుపు నొప్పి. కావున, మీ పిల్లలను ఆడుకోవడానికి ప్రోత్సహించండి. ఎప్పుడూ ఆన్లైన్ గేమ్స్ మాత్రమే కాకుండా గ్రౌండ్లో ఫిసికల్ గేమ్స్ ఆడమని చెప్పండి.

3. పెరుగు

ఏ రకమైన ఉదర సమస్యకైనా పెరుగు పరిష్కారం. ఇది కడుపు చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు డయేరియా వంటి వాటిని నివారిస్తుంది. జీర్ణాశయంలో సహాయపడే మంచి బ్యాక్టీరియను తిరిగి పొందడానికి మరియు జీర్ణక్రియను నియంత్రించడానికి పెరుగు సహాయపడుతుంది.

4. కారం మరియు మసాలాలు తగ్గించండి

కడుపు నొప్పి లేదా విరోచనాలు అవుతున్నప్పుడు వీలైనంత కారం మరియు మసాలాలు తగ్గించండి. ఓట్స్ లేదా పాస్తా వంటి ఆహరం ఇవ్వండి. అంతే కాకుండా, కడుపు నొప్పితో బాధ పడే అప్పుడు సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని పెట్టండి.

5. వేడి నీళ్ళతో కాపురం పెట్టండి

మీ పిల్లలు కడుపు నొప్పితో బాధ పడుతుంటే ఒక పల్చటి వస్త్రాన్ని వేడి నీళ్లలో ముంచి తీసి, నీటిని పూర్తిగా పిండి ఆ వస్త్రంతో కడుపు మీద మర్దన చేయండి. మీరు చర్మం మీద కొంత వేడి కలగ చేస్తే రక్త ప్రవాహం బాగా జరిగి నొప్పి తగ్గుతుంది.

6. అల్లం

ఈ పదార్ధము దాదాపు ప్రతి భారతీయ ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి ఇది చాలా కష్టం ఏమి కాదు. అల్లంలో ఉండే ఔషధ పదార్థాలు, అసౌకర్యం మరియు వికారం తగ్గిస్థాయి. అల్లం ని మీరు టీ రూపంలో కానీ వేడి నీటిలో కానీ కంచి మీ పిల్లాడికి ఇవ్వచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు  అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచడంలో సహాయపడతాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon