Link copied!
Sign in / Sign up
9
Shares

మీ పిల్లలకు ఫోటోలు తీస్తున్నారా..! అయితే ఒక్కసారి ఈ 4 జాగ్రత్తలు తీసుకోండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఫోన్లు, సెల్ఫీలు బాగా అందంగా తీసుకునే మొబైల్స్ ప్రతి ఒక్కరి దగ్గరగా ఉన్నాయి. పిల్లలు పుట్టిన దగ్గరి నుండి వారిని  అందంగా ముస్తాబు చేసి ఫోటోలు తీసి మంచి జ్ఞాపకంగా ఉంచుకోవడం చేస్తున్నారు. స్నేహితులు, బంధువులకు పంపించడం లేదా సోషల్ మీడియాలో పెట్టి అందరితో పంచుకోవడం చేస్తున్నారు. ఇలా మీ పిల్లలకు ఫోటోలు తీసే క్రమంలో ప్రతి తల్లితండ్రులు కొన్ని తప్పులు చేస్తున్నారు. వీటివల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవల్సి వస్తోంది, కాబట్టి ఈ జాగ్రత్తలు వెంటనే తీసుకోండి..

ఫ్లాష్ ఆఫ్ చేయండి

అప్పుడే పుట్టిన ఒక బాబును వచ్చిన బంధువులు ముద్దుగా ఉండటంతో ఫోటోలు తీసుకున్నారు. ఈ సమయంలో ఫ్లాష్ ఆన్ చేయడం వలన బాబు కుడికన్ను మసకబారింది. వయస్సు పెరిగే కొద్దీ సరిగ్గా కనిపించలేదు. అందుకని పిల్లలకు ఫోటోలు తీస్తున్నప్పుడు మొబైల్ లేదా కెమెరా ఫ్లాష్ ఆన్ లో ఉండకుండా, ఎక్కువ కాంతి వారి కళ్లపై పడకుండా చూసుకోవాలి. మీరు సంతోషం కోసం తీస్తున్న ఫోటోలు కొన్నిసార్లు ఇలా బాధకు గురిచేసే అవకాశం ఉంది.

లొకేషన్ బాగా ఉండేలా చూసుకోండి..

మీ పిల్లలకు ఫోటోలు తీయవద్దు అని ఎవరు చెప్పిన వినరు, అందుకే ఫ్లాష్ ఆఫ్ చేసుకుని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ పిల్లల ఫోటోలు అందంగా, మంచి జ్ఞాపకంగా ఉండాలంటే పచ్చిక బయళ్లు, పార్క్ లు, ఇంట్లోనే అందంగా ఉండే చోటు, పిల్లలు బెడ్ పై పడుకున్నప్పుడు, దొర్లుతూ లేదా నడుస్తూ ఉన్నప్పుడు ఫోటోలు తీస్తే చాలా అందంగా ఉంటాయి.

ఈ కెమెరాలు వాడటం మంచిది

పిల్లల ఫోటోలు తీసుకుని మురిసిపోవడం అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమే. ఐతే కొన్నికొన్ని మొబైల్స్, కెమెరాలలో ఫోటోలు తీస్తే ఈ ఫోటోలు మానవేనా..! అనే డౌట్ వస్తుంది. అందుకే కెమెరా మొబైల్స్, డిజిటల్ కెమెరాలు తీసుకునేటప్పుడు నాసిరకమైనవి కాకుండా కాస్త ఖర్చు ఎక్కువైనా నాణ్యమైనవే తీసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలా ఫోటోలు తీసుకోలేరు కదా.

ఇది చాలా ముఖ్యం

పిల్లలను కుర్చీలు లేదా బెడ్ పై కూర్చోబెట్టి, బైక్ పై కూర్చోబెట్టి లేదా నిల్చోబెట్టి, వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి ఫోటోలు తీస్తున్నప్పుడు పిల్లలు జారిపోయి పడిపోతూ ఉంటారు.. అందుకని వారిని అనుక్షణం ఈ సమయంలో గమనిస్తూ ఉండాలి. పిల్లలు నేలపై పడిపోకుండా కిందవైపు మెత్తటి దిండ్లు లేదా టెడ్డీ బేర్ బొమ్మలను ఉంచాలి.

ఇంకా మీకు ఏమైనా తెలిసిన పాయింట్స్ ఉంటే చెప్పవచ్చు. ఈ విషయాన్ని అందరికీ SHARE చేయండి..   

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon