Link copied!
Sign in / Sign up
86
Shares

మీ పిల్లలకు మీరు ఇచ్చే ఈ ఆహారాలు క్యాన్సర్ కు కారణం అవుతాయి : జాగ్రత్త పడండి

తన 5 ఏళ్ళ కొడుకు కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు. వాతావరణం మార్పులు వలన అలా ఉన్నాడని అమ్మ అనుకుంది. బిడ్డ శరీరం వేడిగా ఉంటే జ్వరం అనుకుని టాబ్లెట్ ఇచ్చింది. ఉదయం నిద్రలేచేసరికి బెడ్ పై వాంతి చేసుకుని ఉన్నాడు. కంగారుతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా చెకప్ చేసి క్యాన్సర్ అని చెప్పాడు.  దీని కారణం మీరు డైలీ మీ బిడ్డకు ఇస్తున్న ఆహారమే అని అన్నాడు. అమ్మ ఇచ్చిన ఆ ఆహారం ఏంటో మీరే చూడండి.

పిల్లలు ఇష్టపడుతున్న ఆహారాలు

బుడిబుడి నడకలు వేసే పిల్లలు, స్కూల్ కు వెళ్లే పిల్లలు తమ కంటికి ఆకర్షణగా కనిపించే చిప్స్, జంక్ ఫుడ్స్, తియ్యగా ఉండే ఆహారాలు, ఇటువంటి వాటిని బాగా ఇష్టపడుతున్నారు. బయటకు ఆకర్షణగా ఉన్నా వీటిలో కెమికల్స్ కలిపి ప్లాస్టిక్ కవర్ లలో స్టోర్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ కారణంగా,  టాక్సిక్ కెమికల్స్ వలన పిల్లల శరీరం రోగాల బారిన పడుతుంది. మీరు ఇది మాములే అని నిర్లక్ష్యం చేయడం వలన ఇలా క్యాన్సర్ కు దారితీస్తుంది.

క్యాన్సర్ కు కారణమయ్యే ఆహారాలు

నూడిల్స్, జంక్ ఫుడ్స్, కొన్ని రకాల బ్రెడ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలపై రాసుకునే జామ్, చిప్స్, ప్లాస్టిక్ కవర్ లలో ఎక్కువకాలం స్టోర్ చేయబడ్డ ఆహారాలు ఇవి పిల్లల ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రభావం చూపించి అనారోగ్యానికి దారితీస్తాయి. పిల్లలు అవే కావాలి అని మారాం చేస్తుంటారు,  అటువంటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వయస్సు వారికి ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలో తెలుసుకోండి. పైన చెప్పుకున్న జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కొన్ని లక్షల మంది పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు. ఇవేవీ మన న్యూస్ ఛానల్స్, పేపర్ లలో రాకపోవడం ఆశ్చర్యకరం.

ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరికీ తెలిసేలా దయచేసి SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon