Link copied!
Sign in / Sign up
22
Shares

మీ పిల్లలకు కోపం తెప్పించే ఈ 5 పనులు ఎప్పుడు చేయకండి

పిల్లల పెంపకంలో ప్రతి విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి.  ఆహారం ఎన్ని సార్లు తినిపించాలి, ఏ వేళలో  ఏ ఆహారం తినిపించాలి, ఎలా నిద్రపుచ్చాలి, ఎలా స్నానం చేయించాలి. ఇలా అనేక చేయాల్సిన పనుల గురించి తెలుసుకునివుంటారు కానీ, చేయకూడని పనులు గురించి తెలుసుకున్నారా? అవును పిల్లలకు కొన్ని పనులు చేస్తే కోపం కూడా వస్తుంది. పిల్లలకు కోపం తెప్పించే ఆ పనులేంటో చూడండి….

1. పట్టించుకోకుండా ఉండడం

పిల్లలు ఎదిగే క్రమంలో, మొదటి మూడు సంవత్సరాలు, తమ చుట్టూ ఉన్న వారిని గమనించి, తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో వాళ్ళు ఏదైనా విషయాన్నీ వ్యక్తపరచడానికి, ఎదుటివారిని తాకడానికి ప్రయత్నిస్తారు. మీరు ఆ సమయంలో వాళ్ళని పట్టించుకోకుండా ఉండకండి. ఏదోటి మాట్లాడడానికి ప్రయత్నించండి.

2. ఏడుపును అలక్ష్యం చేయడం

మీకు ఏదైనా బాధ కలిగి, ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోకపోతే మీకు ఎలా ఉంటుంది?అలాగే పిల్లల ప్రతి ఏడుపుకు ఒక కారణం ఉంటుంది. పిల్లలు ఏడుపు మాములే కదా అని పట్టించుకోకుండా ఉండకండి.

3. వంటరిగా వదిలిపెట్టడం

పిల్లలను ఎక్కువ సేపు వంటరిగా వదిలి పెట్టి వెళ్లిపోకండి. మీరు అలా ఎందుకు వదిలిపెట్టి వెళ్లిపోయారో పిల్లలకు అర్ధం కాదు. దిగులు పడుతారు. పిల్లలను ఎప్పుడు మీతోనే ఉంచుకోడానికి ప్రయత్నించండి.

4. ఎత్తుకోకుండా, హత్తుకోకుండా ఉండడం

పిల్లలకు తమను ఎవరైనా ఎత్తుకున్నా, లేదా హత్తుకున్నా చాలా ఆనందపడుతారు.  కొంత వయసువచ్చాక పిల్లలు సైగలు నేర్చుకుంటారు. తమకు కావాల్సింది తెలియచేయడానికి ఏదో విధంగా ప్రయత్నిస్తారు. అలాగే వాళ్ళు ఎత్తుకోమని చేతులు చాచినప్పుడు, మీరు ఎత్తుకోకపోతే వాళ్ళకు కోపం వస్తుంది.

5. శిక్షించడం

పిల్లలను మీరు కోప్పడడం, లేదా కొట్టడం లాంటివి చేస్తే, పిల్లలు చాలా దిగులుపడిపోతారు. అలా మీరు ఎందుకు చేస్తున్నారో వారికి  అర్ధం కాదు. ఇలా చేయడం వారి మానసిక ఎదుగుదల మీద చెడు ప్రభావం చూపిస్తుంది. అలా ఎప్పుడు చేయకండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon