Link copied!
Sign in / Sign up
163
Shares

మీ పిల్లలలో జలుబు దగ్గును వెంటనే తగ్గించే 6 ఇంటి చికిత్సలు : చాలా సులభం

జలుబు మరియు దగ్గు బారిన పడని వారు ఈ భూప్రపంచంలోనే ఉండరు అనడం అతిసయోక్తి కాదు. ఒక్కసారి వచ్చింది అంటే  అంత సులువుగా వెళ్ళదు. ఎన్ని మందులు వాడిన పెద్దగా ప్రయోజనం కనిపించదు. అందుకే జలుబు మందులు వాడితే వారంలో తగ్గిపోతుంది, వాడకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది అని జోకులు వేస్తుంటాము. మనకు వచ్చినా పర్లేదు, కానీ మన పిల్లలకి వస్తే మాత్రం అది చూసి తట్టుకోవడం చాలా కష్టం. దీనిని గమనించి ఇంట్లో వాడే   పదార్థాలతోనే జలుబు దగ్గు ఎలా తగ్గించాలో మీకోసం ఇక్కడ చెప్తున్నాము.

  1. తేనె (హనీ)

తేనెలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అంతే కాకు౦డా తేనె మంచి అన్టిసేప్తిక్. అర టీ స్పూన్ తేనెను  గోరువేచ్చని నీటిలో  కలిపి మీ పిల్లలకి తాగిస్తే జలుబు మరియు గొంతు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా సంవత్సరం పైబడిన పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

  1. అల్లం (జింజర్)

అల్లం సహజంగానే దొరికే గొప్ప ఔషదము. దీని ఉపయోగాలు అనేక రకాలు. ముఖ్యంగా జలుబు దగ్గు నివారణకు ఉపకరిస్తుంది. చిన్న పిల్లల కోసం, కొద్దిగా అల్లం ముక్కను తీసుకొని బాగా మరుగుతున్న నీలల్లో వేయండి. అల్లం సారమంతా నీలల్లోకి వచ్చాక నీటిని చల్లరబెట్టండి. ఆ నీటిలో అర టీ స్పూన్ తేనెను వేసి మీ పిల్లలకి ఇవ్వండి.

  1. సెలైన్ డ్రాప్స్

మీ పిల్లల ముక్కులు మూసకపోయుంటే ఐలా చేయండి. పావు టీ స్పూన్ ఉప్పు ఒక గ్లాసు నీలల్లో కలపండి. ఈ నీటిని డ్రాప్స్ము లా ముక్కులో వేయడం ద్వారా ముక్కు రంధ్రాలు తెరుచుకొని ఊపిరి తీసుకోవడం సులువుగా మారుతుంది.

గమనిక: ఇలా రోజుకి నలుగు సార్లకు మించి చేయరాదు.

  1. అద్భుత మిశ్రమం

ఒక గ్లాసు నీటిలో 2-3 తెల్లుల్లి ముక్కలు వేసి బాగా మరిగించండి. తరువాత ఆ నీటిలో అర టీ స్పూన్ తేనె, చిటికెడు కారం పొడి మరియు కొంచెం నిమ్మ రసం కలపండి. అంతే ఈ మిశ్రమం జలుబు తగ్గించడంలో అద్బుతంగా పని చేస్తుంది.

  1. పసుపు

పసుపు యొక్క గొప్పదనం ఎంత చెప్పిన తక్కువే. గాయాలకి మందుగా పనికొస్తుంది, అంద౦ పెరగడంలో దోహదపడుతుంది ఇలా ఎన్నో ఉపయోగాలు. అంతే కాకుండా పసుపు జలుబు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగితే జలుబు తగ్గుతుంది. రోజు ఐలా తాగడం వలన జలుబు దగ్గు వెంటవెంటనే మన దరికి రావు.

  1. చమోమిలే

చమోమిలే టీ బాగ్ ని వేడి నీటిలో కలుపుకొని తాగితే జలుబు వెంటనే తగ్గుతుంది. ఇది చాలా సులువుగా జలుబు తగ్గించుకోగలిగే ప్రక్రియ.గొంతు గర గర నివారణకు కూడా ఉపకరిస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
67%
Wow!
33%
Like
0%
Not bad
0%
What?
scroll up icon