Link copied!
Sign in / Sign up
54
Shares

మీ పిల్లలకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినిపించేముందు ఒక్కసారి ఇది చూడండి..

పిల్లల ఎదుగుదలకు, వారి ఆరోగ్యానికి మంచి ఆహారం ఫ్రూట్స్ అనే చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఘనమైన ఆహారాన్ని ఇచ్చేముందు తల్లితండ్రులు  చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక అమ్మ తన బిడ్డకు ఇచ్చిన ఆహారం వలన ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందో ఈ ఎక్స్ రే ఫోటోలో గమనించండి.

గొంతులో ఇరుక్కుపోయిన ద్రాక్షపండు

ఆస్ట్రేలియాకు చెందిన ఏంజెలా హాండర్సన్ అనే మహిళ తన 5 ఏళ్ళ బిడ్డకు ద్రాక్ష పండ్లు తినమని ఇచ్చింది. సరిగ్గా తినకపోవడం వలనో లేక పెద్దవిగా ఉండటం వలనో ద్రాక్ష పండు గొంతులో ఇరుక్కుపోయింది. కొన్ని నిముషాల పాటు ఆ పిల్లాడు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఎక్స్ రే ను చేతిలో పెట్టారు డాక్టర్లు.

ద్రాక్షపండును ఇలా బయటకు తీశారు

ఆ అబ్బాయి గొంతులో ద్రాక్ష పండు ఇరుక్కుపోవడంతో జెనరల్ అనస్థీషియా సహాయంతో శస్త్రచికిత్స చేసి ద్రాక్షపండును బయటకు తీశారు. తన బిడ్డకు జరిగిన విధంగా మరొకరికి ఇలా జరగకూడదని ఆ తల్లి సోషల్ మీడియాలో ఈ ఎక్స్ రే ఫోటోను షేర్ చేసింది. అందుకే మీ పిల్లలకు ఏదైనా పండ్లు, ఘనమైన ఆహారాన్ని ఇస్తున్నప్పుడు దయచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వడం చాలా మంచిది.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి తల్లికి చేరేలా SHARE చేయగలరు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon