Link copied!
Sign in / Sign up
8
Shares

మీ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి నేర్పించాల్సిన 6 అలవాట్లు

ఇద్దరు తల్లులు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకునే విషయాలలో, ముఖ్యమైనది తమ పిల్లల ఆరోగ్యం గురించి. ఏదైనా అనారోగ్యం చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినిపించాలి. ఇవే మాటలు. తప్పకుండా అవి చాలా అవసరం. జబ్బులు వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానికన్నా, అసలు పిల్లలకు ఏ అనారోగ్యం రాకుండా ఎలా కాపాడుకోవాలి అన్నది ఇంకా ముఖ్యం. అలా చేయడానికి ఇవే మార్గాలు…

1. వ్యాయామం

పిల్లలలో రోగ నిరోధక శక్తి, వ్యాయామం చేయడం వలన 20%-25% శాతం పెరుగుతుంది. అందుకే పిల్లల రోజు వారి కార్యక్రమాలలో వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. సైకిల్ తొక్కడం, కొంత దూరం నడవడం, ఏదైనా ఆటలు ఆడడం లాంటివి పిల్లలకు తప్పకుండా అలవాటు చేయండి. వీటి ద్వారా పిల్లల  శరీరానికి కావాల్సిన వ్యాయామం అందుతుంది. పిల్లలు చురుకుగా ఉండడమే కాకుండా, అనారోగ్యాలకు దూరంగా ఉంటారు.

2. చేతులు కడుక్కోవడం

ఈ విషయాన్నీ చాలా మంది తల్లి తండ్రులు అశ్రద్ధ చేస్తారు. కానీ పిల్లలకు రోగాలు రాకుండా కాపాడడానికి అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఇదే. పిల్లల చేతుల్లో రోగకారక క్రిములు ఉంటాయి, ఇవి చేతుల ద్వారా శరీరం లోకి ప్రవేశించి రోగాలను కలిగిస్తాయి. అందుకే పిల్లలు భోజనానికి ముందు, కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కునేలా చేయండి..

3. నిద్ర

పిల్లలను నిద్ర పుచ్చడం చాలా కష్టమైన పనే. కానీ పిల్లలు ఆరోగ్యానికి అత్యంత అవసరం. పిల్లలు తమకు కావాల్సిన సరైన నిద్ర పొందినప్పుడు, వారి రోగ నిరోధక పెంచే తెల్ల రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే ఎమీ చేసైనా పిల్లలు సరైన సమయానికి నిద్రపోయేలా చేయండి.

4. వాక్సినేషన్

పిల్లలకు రోగాలు చాలా సులభంగా వస్తాయి. అందుకే రోగాలను అప్పడానికి ముందుగానే, వాక్సినేషన్ వేయించడం చాలా అవసరం. పిల్లలకు చిన్నపాటి నుండి డాక్టర్ సలహాల ప్రకారం, వేయించాల్సిన వాక్సిన్స్ అన్ని క్రమం తప్పకుండా వేయించండి.

5. ఆహారం

మీ పిల్లలకు అన్ని పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని ఇవ్వండి. ఆహారం పిల్లల ఎదుగుదలకే కాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్ని రకాల ఆహారపదార్ధాలను అలవాటు చేయండి. వారికీ కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందేలా చూడండి. రోగాల నుండి కాపాడండి

అందరికి తప్పకుండా SHARE చేయండి… అందరికి తెలియచేయండి…

ఇవి కూడా చదవండి….

పిల్లలలో రోగనిరోధక శక్తి పెరగడానికి తినిపించాల్సిన 7 అద్భుతమైన ఆహారాలు

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon