Link copied!
Sign in / Sign up
1
Shares

మీ పిల్లలకు ఈ 5 ఆహారాల ద్వారా మసాలాను పరిచయం చేయండి


పసి పిల్లలకు 8 నెలల వయస్సు వచ్చే వరకు స్పైసెస్ తినిపించకపోవడం మంచిది. వారికి కారం జీర్ణించుకునే శక్తి వచ్చే వరకు మనం వాటిని అందివ్వక పోవడం ఉత్తమమైన పద్దతి. మీ చిన్నారికి స్పైసెస్ పరిచయం చేస్తున్నట్టయితే, ఒకసారి తినిపించిన తరువాత 2 రోజులు ఆగి తరువాత తిరిగి పెట్టండి.

ఇలా చేయడం ద్వారా చిన్నారికి ఏమైనా ఎలర్జీ వస్తుందా అని గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. కారం అనే కాదు,  ఏ కొత్త ఆహారం ఇచ్చినా ఈ పదట్టిని పాటించండి. మరో ముఖ్య విషయం, సంవత్సరం దాటే వరకు ఎక్కువ కారం ఉన్న ఆహారాన్ని ఇవ్వకండి.

మీ చిన్నారికి స్పైసెస్ పరిచయం చేయడానికి అనువైన 5 వంటకాలు ఏమిటో తెలుసుకుందామా…

1. పాయసం

మాములుగా చేసే పాయసంలో కొంచెం యాలకలు పొడి వేసి మీ చిన్నారికి తినిపించండి. సాధారణ ఆహారంతో పాటు స్పైసెస్ రుచి తెలియ చేసినట్టు అవుతుంది.

2. పప్పు

మీ మాములుగా చిన్నారికి పప్పు చేస్తున్నప్పుడు ఆవాలు, ఫెన్నెల్, జీలకర్ర మరియు పసుపుని పొడి రూపంలో జోడించండి. మెత్తని అన్నంతో దీనిని కలిపి, మీ బిడ్డకు తినిపించడం ద్వారా వారికి శరీరానికి అవసరమైన పోషకాలను ఇవ్వవచ్చు.

3. పెరుగు

మింట్ ఫ్లేవర్ని పెరుగు ద్వారా పరిచయం చేయడం మంచిది. కొంచెం మింట్ ఫ్లేవర్ని పెరుగులో కలిపి మీ చిన్నారికి తినిపించండి.

4. ప్యాన్ కేకులు

ఫ్యాన్ కేకులకు స్ట్రాబెర్రీ లేదా మింట్ ఫ్లేవర్ జోడించి తినిపించవచ్చు. ఈ వంట చిన్నారులు ఎంతో ఇష్టపడతారు అని అనేక మంది తల్లులు అభిప్రాయపడ్డారు.

5. జీరా వాటర్

జీరా నీళ్లు కడుపుని క్లీన్ చేస్తాయి అని మనకు తెలిసిన విషయమే. దీనిని వారికి ఇవ్వడం ద్వారా వారి పొట్ట శుభ్రం అవ్వడమే కాకుండా రుచిని కూడా ఆనందిస్తారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon