Link copied!
Sign in / Sign up
2
Shares

మీ పిల్లల పాల డబ్బాల్లో ఈ 4 పదార్ధాలు కలపడం వెంటనే మానేయండి!!

పిల్లల మొదటి 6 నెలలు వరకు తల్లి పాలు అత్యంత అవసరం. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీ బిడ్డకు డబ్బా పాలు పట్టించాల్సిన అవసరం రావచ్చు. అయితే మీరు మీ బిడ్డకు డబ్బాతో పాలు పట్టించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బా పాలలో ఏమి కలుపుతున్నారు అన్నది చాలా ప్రధానం.  కొన్ని పదార్ధాలను డబ్బా పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం చాలా ప్రమాదం…. అవేంటో ఇక్కడ చూడండి…

1. గ్రైప్ వాటర్

సాధారణంగా పిల్లలకు కడుపు నొప్పి లేదా అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు గ్రైప్ వాటర్ ఇస్తుంటారు. దీనిలో కొంత ఆల్కహాల్ ఉంటుంది. అది పిల్లలకు అంత మంచిది కాదు. పిల్లల డబ్బా పాలలో ఇది కలపడం అంత మంచిది కాదు.

2. కార్న్ సిరప్

చాలా ఏళ్ళ నుండి పిల్లలలో మలబద్దక సమస్యకు కార్న్ సిరప్ ను అందరూ వాడుతుంటారు. కానీ దీని బోటులిజం అనే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అందుకే దీనిని పిల్లల పాల డబ్బాల్లో కలపకండి.

3. అన్నం 

చాలా పాల డబ్బాల్లో మెత్తగా చేసిన అన్నం కలిపి పిల్లలకు పాలు పట్టిస్తారు. అది అంత మంచిది కాదు. పిల్లలకు మీరు ఒక వేళ అన్నాన్ని అలవాటు చేయాలంటే, అది వేరుగా తినిపించండి. అన్నం పాల డబ్బాల్లో కలపడం వలన అది పిల్లలకు సరిగా అరగదు.

4. మందులు

పిల్లలకు ఏదైనా మందు వాడాల్సినప్పుడు వాటిని డబ్బాల్లో కలిపి పాల ద్వారా ఇవ్వకండి.  అవి పాలతో కలిసి పిల్లలకు రియాక్షన్ కలిగించచ్చు. వాటిని వేరుగా ఇవ్వండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon