Link copied!
Sign in / Sign up
1
Shares

మీ పిల్లల బరువును పెంచే అద్భుతమైన 5 ఆహారాలు

పిల్లలు బరువు పెరగటం లేదు, మా పిల్లాడు లావుగా లేడని చాలామంది తల్లితండ్రులు బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు చిరుతిండ్లు ఎక్కువగా తినటం వలన అమ్మ చేసే ఆహారాన్ని వద్దని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఆహార పదార్థాలను మీ పిల్లలకు ఇవ్వడం  వలన బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.

వెన్న

అవును, వెన్న వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరుతుందని అంటుంటారు. దీనికన్నా బక్కగా ఉన్న పిల్లల బరువు పెంచడానికి వెన్న బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మార్కెట్ లో లభించే వెన్న కాకుండా, స్వచ్ఛమైన పాల నుండి తీసిన వెన్న ఐతే పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే పీనట్ బటర్ మరియు ఆల్మండ్ బటర్ పిల్లల బరువు పెరగడానికి ఉపయోగపడతాయి.

పాలు మరియు క్రీమ్స్

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాస్ పాలు ఉదయం మరియు సాయంత్రం ఇవ్వటం వలన పిల్లల ఆరోగ్యానికి మరియు బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. పాలు ఒక్కటే తాగటం లేదు అనిపిస్తే మిల్క్ షేక్స్, తృణ ధాన్యాలతో కలిపి ఇవ్వటం వలన బాగా ఇష్టపడతారు. వీటితో పాటు రుచికరమైన బిస్కట్స్, క్రీమ్స్ కలిపి ఇవ్వడం చేయండి.

గుడ్లు మరియు అరటిపండు

బక్కగా ఉన్న పిల్లలకు వెంటనే రోజూ అన్నం తినే సమయంలో ఒక గుడ్డు, అన్న తిన్న ఒక అరగంట తర్వాత ఒక అరటిపండు ఇవ్వడం వలన బరువు పెరగడానికి సహకరిస్తాయి. వీటిలో అధిక మోతాదులో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు క్యాలరీలు ఉండటం వలన బరువు పెంచేందుకు తోడ్పడుతాయి.

అవకాడో

ఇది చాలామందికి పరిచయం లేని పండు. కానీ, వీటిలో అధికంగా న్యూట్రియంట్స్ ఉండటం వలన బరువు పెరగని చిన్నారులకు, ఎదుగుతున్న పిల్లలకు ఇవ్వడం మంచిది. ఇందులో కొవ్వు శాతం మరియు అధిక క్యాలరీలు ఉంటాయి కాబట్టి రోజుకొకటి చొప్పున ఇస్తే చాలు.

మాంసం మరియు పొటాటో

ఎదిగేపిల్లలలకు పైన చెప్పుకున్న ఆహారాలతో పాటు వారంలో కనీసం ఒకసారి మాంసం అలవాటు చేయడం వలన పిల్లల బరువు పెరగడానికి, కండరాలు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆలుగడ్డను పిల్లలకు వారానికి ఒకసారి అలవాటు చేయండి. ఇంకా క్యారెట్, బీట్ రూట్, పచ్చి ఆకుకూరలు కూడా మంచివే.

పిల్లల బరువును పెంచే ఈ ఆహారాలు, ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon