Link copied!
Sign in / Sign up
50
Shares

మీ పిల్లల అందం పెరగడానికి తినిపించవలసిన 5 ఆహారాలు

పుట్టుకతోనే అందరూ అందంగా, కళగా పుట్టలేరు. కొందరిలో వయస్సు పెరిగేకొద్దీ రంగులో మార్పు రావడం, చర్మం కాంతివంతంగా మెరుస్తూ అందంగా రావడం   జరుగుతూ ఉంటుంది. మరికొందరి పిల్లలలో తల్లితండ్రుల పోలికలే ఎక్కువగా ఉంటాయి, అలాగే చర్మం రంగులో కొన్ని రకాల పద్ధతులు ఫాలో అయిన కూడా పిల్లల రంగులో మార్పు ఉండకపోవచ్చు. అందుకని మీ పిల్లల అందం పెరగాలంటే ప్రగ్నన్సీ సమయంలో మీరు తినాల్సిన కొన్ని ఆహారాలు మరియు పిల్లలు పుట్టిన  తర్వాత వారికి తినిపించవలసిన ఆహారాలు ఏంటో  చూసేద్దాం…

తల్లి పాలు

మీకు తెలుసా..బిడ్డకు తల్లి పాలు తప్పనిసరిగా ఆరు నెలల పాటు అవసరం. తల్లి పాలు 6 నెలల పాటు క్రమం తప్పకుండా బిడ్డకు ఇవ్వడం వలన ఆరోగ్యంగా, బలంగా తల్లి మరియు బిడ్డ ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల చర్మం రంగులో ప్రకాశవంతమైన మార్పు కనిపిస్తుంది.

ఆపిల్

పసి పిల్లలకు ఆరు నెలలు లేదా ఎనిమిది నెలల తర్వాత సాలిడ్ ఫుడ్ పెట్టడం మొదలుపెడుతూ ఉంటారు. ఆరు నెలల తర్వాత పిల్లలకు ఆపిల్, క్యారట్, బీట్ రూట్ వంటి పోషక విలువలు వృద్ధిగా కలిగినటువంటి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రంగా ఉన్న నీటితో కడిగి ఉడికించాలి. ఈ ఆహారం మెత్తగా, జారుడుగా ఉండటం వలన గొంతులో ఆహారం ఇరుక్కుపోదు, త్వరగా జీర్ణం అవుతుంది. ఈ ఆహారం మీ పిల్లల రంగు మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది.

నెయ్యి, బాదం

మీరు గర్భంతో ఉన్నప్పుడు నెయ్యి, బాదం, ఆరంజ్, ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అందం పెరగడానికి ఉపయోగపడతాయి. అలాగే మీకు వికారం కలగకుండా ప్రతి రోజూ కొద్దిగా సోంపు (జీలకర్ర) తీసుకోవడం వలన ప్రగ్నన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

సున్నిపిండి

పిల్లల రంగు మారట్లేదు, చర్మం ప్రకాశవంతంగా లేదు అని బాధపడుతున్న తల్లులకు ఉత్తమ చిట్కా సున్నిపిండి. చిన్నతనంలో పిల్లలకు స్నానం చేయించేముందు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెతో శరీరానికి మసాజ్ చేసి ఆ తరవాత సున్నిపిండితో కాస్త పాలు లేదా నీటిని కలిపి పిల్లల శరీరంపై సుతిమెత్తగా రాసి స్నానం చేయించడం వలన పిల్లలు అందంగా ఉంటారు.

పెసరపిండి

పైన చెప్పినట్లుగా సున్నిపిండితో ఎలా ఐతే స్నానానికి ముందు మసాజ్ చేసి స్నానం చేయించారో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం పెసరపిండి, కాస్త పసుపు మరియు కొంచెం పాలమీగడ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సుతిమెత్తగా పిల్లల చర్మంపై స్నానాని కి ముందు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన పిల్లల చర్మం అందంగా మెరిసిపోతుందని మన పెద్దలు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఎటువంటి కెమికల్స్ కలపకండి. చర్మంపై దద్దుర్లు, మంట వచ్చే ప్రమాదం ఉంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon