Link copied!
Sign in / Sign up
2
Shares

మీ పెళ్లిలో తప్పకుండా జరగాలని కోరుకునే 7 విషయాలు : మీ పెళ్ళిలో ఇలా జరిగాయా..!

పెళ్లి అనేది బహుశా ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇది జీవితాన్ని మంచి కోసం మార్చే ఒక గొప్ప వేడుక. భారతదేశంలో జరిగే వివాహాలు కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబందించినది మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక గొప్ప పండగ. ఆహ్లాదకరమైన, ఉల్లాసభరితమైన మరియు సంబరాలలో మునిగి తేలే గొప్ప పండగే పెళ్లంటే. అటువంటి గొప్ప రోజుని మీరు మరింత అందంగా మార్చుకోవడానికి ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకోండి.

1. వారం పొడవునా సెలెబ్రేషన్స్ వద్దు

సంబరాలు ఉత్తేజకరమైనవి అయినప్పటికీ, చివరకు అలసిపోతారు. కుటుంబ సభ్యులతో మరియు సన్నిహితులతో మీ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక సాయంత్రం సరిపోతుంది. ఎలాగో ఆచారాలు అవి ఉంటాయి కాబట్టి వారం మొత్తం సెలెబ్రేషన్స్ పెట్టుకుంటే అలసిపోయి ఆనందంగా ఉండలేరు. కనుక వారం పొడవునా సెలెబ్రేషన్స్ పెట్టుకోకపోవడం మంచిది.

2. తక్కువమంది అతిధులు - ఎక్కువ సంతోషం

మీకు తెలిసిన ప్రతి ఇతర వ్యక్తిని మీరు ఆహ్వానించకూడదు. మీ అతిథి జాబితాను చిన్నదిగా ఉంచి, మీ కుటుంబ సభ్యులకు మరియు సన్నిహితులతో సరదాగా గడపండి. మీ ఆనందం పంచుకోవాలి అనిపించే కొంతమందిని మాత్రమే పిలవడం మంచిది.

3. ఫ్యాన్సీ వేదికలు

5 స్టార్ హోటల్లో పెళ్లి చేసుకోవాలని లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అందరికి ఆశగా ఉంటుంది. కాని ఆనందాన్ని ఇవ్వని ఖర్చు మనకు అవసరమా? ఆడంబరరాలకు పోయి ఆనందాన్ని దూరం చేసుకుంటామా? మీకు కాబోయే భాగస్యామికి మరియు మీ కుటుంబ సభ్యులకు ఎక్కడ సౌకర్యంగా ఉంటె అక్కడ చేసుకోవాడం ఉత్తమం. ఎందుకంటే, పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాం అని గుర్తుండదు కానీ ఎంత సంతోషంగా ఉన్నాం అన్నది మాత్రం జీవితాంతం గుర్తుంటుంది.

4. సామాజిక కారణాలు

ఈ రోజుల్లో జంటలు సంప్రదాయ వివాహాలకు బదులుగా న్యాయస్థానం వివాహం వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ఆదా అయిన డబ్బుతో పేదలు మరియు నిరాశ్రయులకు ఆహారం అందించటం వంటి మంచి పనులు చేస్తున్నారు. డబ్బు వృధా కాకుండా ఒక మంచి పనికి వాడినందుకు చాలా సంతోషిస్తున్నారు.

5. మీ తల్లిదండ్రులను ఏమైనా చెప్పమని అడగండి

పెళ్లి అనేది మీకు రెండు మాత్రమే కాదు మీ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనది. ప్రతి పేరెంట్ తమ బిడ్డ వివాహం గురించి ఎన్నో కలలు కనుంటారు. మీ వివాహంలో మీ గురించి ఏమైనా చెప్పమని మీ తల్లిదండ్రులను అడగండి మరియు వారికి తగిన ప్రాముఖ్యత ఇచ్చి వారిని సంతోషపెట్టండి.

6. మాటివ్వండి

ఒక వివాహం అనేది జీవితకాల వాగ్దానం ... మరణం మమ్మల్ని వేరు చేసే వరకు కలిసి ఉండటామన్న వాగ్దానం. ఇటువంటి వాగ్దానాన్ని చులకనగా తీసుకోకూడదు. కావున మీరు చేసే ప్రోమిస్ని రాయడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. మీరు చెప్పే ప్రతి మాట మీ హృదయంలోంచి రావాలి ఎందుకంటే మీ భాగస్వామితో మీరు చెప్తున్నా మొదటి మాట ఇదే కనుక.

7. వ్యక్తిగత సమయం

గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజు మీకు మరియు మీ భాగస్వామికి అత్యంత ప్రత్యేకమైనది. అందుకే ఎంత హడావిడిగా ఉన్నా మీ భాగస్వామితో జీవితాంతం గుర్తించుకునే కొన్ని మధుర క్షణాలు గడపడం మాత్రం మర్చిపోకండి.

సందేహం లేకుండా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద రోజు.కనుక ప్రతి విషయం గురించి క్షున్నంగా అలోచించి సరైన నిర్ణయానికి రండి. మీ పెళ్లిని జీవితాంతం గుర్తించుకునేలా ప్లాన్ చేసుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon