Link copied!
Sign in / Sign up
9
Shares

మీ పెదవుల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం, లక్షణాలు తెలుసుకోవచ్చు

సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అలాగే పక్కవాళ్ళు తమ  గురించి ఏం అనుకుంటున్నారు, మన వ్యక్తిత్వం ఏంటి అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకోసం మీ పెదవుల షేప్ (ఆకారాన్ని) బట్టి మీ వ్యక్తిత్వం, మీకు ఏమంటే  ఇష్టమో సులువుగా తెలుసుకోవచ్చు.

V - ఆకారంలో పెదవులు

వీరు ఎప్పుడు చాలా కొత్తగా క్రియేటివిటీగా ఆలోచిస్తారు. కొత్తవారితో స్నేహం చేయడం, తెలియని విషయాల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇతరులపై ఆధారపడి ఉండటం ఇష్టం ఉండదు. ఏదైనా సాధించేవరకు నిద్రపోము అనే రకం.

పెదవులు బొద్దుగా ఉంటే

వీరు చాలా సెన్సిటివ్. ఎవరైనా నువ్వు చేస్తున్నది తప్పు, ఆలోచించకుండా ఎలా చేస్తావ్ ఇటువంటి పనులు అని సూటి పోటి మాటలు అంటే ఒక్క నిముషం కూడా తట్టుకోలేరు. మనుషులంటే ఎంత ప్రేమో, జంతువులను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు. లైఫ్ లో పెద్ద గోల్స్ ఏమీ పెట్టుకోకపోయినా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు.

కింది పెదవి పై పెదవి కంటే పెద్దదిగా

ఇలా ఉన్నవారు చాలా ఉత్సాహవంతులు. అయితే ఎప్పుడు ఒకేచోట ఉండటం అంటే వీరికి చాలా బోర్. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం, సాహసాలంటే చాలా ఇష్టం.

U - ఆకారంలో పెదవులు

అందరితోనూ త్వరగా కలవలేరు. సిగ్గు, బిడియం, అందరిలో మాట్లాడాలంటే భయం ఇలా కారణం ఏదైనా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం అంటే ఇష్టం.

పై పెదవి పెద్దదిగా ఉంటే

పై పెదవి కింది పెదవితో పోల్చితే పెద్దదిగా ఉంటే వీరికి అందం, ఆకర్షణ ఎక్కువ. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా పదిమందిలో అందంగా, ఆకర్షణగా ఉండాలని కోరుకుంటారు. ఎవరో చెప్పే నిర్ణయాల కన్నా తమ సొంత నిర్ణయాలకే ఎక్కువ విలువను ఇస్తారు. వీరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

ఫ్లాట్ (సమానం, చదును) గా ఉంటే

కొందరిలో పెదవులు ఒకే విధంగా ఫ్లాట్ గా ఉంటాయి. వీరికి లాజిక్స్ చాలా ఎక్కువ. అది ఎందుకు, ఇలా ఎలా వచ్చింది అంటూ చిన్న విషయాలకు సైతం లాజిక్స్ వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విషయాల పట్ల అవగాహన తక్కువగా ఉండటం ఒక కారణం ఐతే ఎవరూ చెప్పేవారు లేకపోవడం మరో కారణం.

పై పెదవి ఫ్లాట్ గా కింది పెదవి బొద్దుగా

వారి పని వారు చేసుకునే టైపు. ఇతరుల విషయాల్లో వేలు పెట్టరు, తమ విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోరు. బాగా మాట్లాడుతూ ఉంటారు. అస్సలు అలసిపోరు. చేసి ప్రతి పనిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. పక్కవాళ్లను సులువుగా నమ్మడం వీరి వీక్ నెస్.

బటర్ ఫ్లై ఆకారంలో పెదవులు

ఇటువంటి ఆకారంలో పెదవులు కలిగిన వారికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అస్సలు తట్టుకోలేరు. జాలి, దయ, కరుణ ఎక్కువ. కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు. తమ వద్ద లేకపోయినా ఇతరులకు సాయం చేసే గుణం వీరి సొంతం.

 ఈ ఆర్టికల్ అందరికీ తెలిసేలా కింద ఉన్న SHARE బటన్ పై క్లిక్ చేస్తే చాలు. 

cover image source : Pixaby

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon