Link copied!
Sign in / Sign up
4
Shares

మీ పాదాలను బట్టి మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు

ఒకే కడుపున పుట్టిన పిల్లలు, కవల పిల్లలు, ఒకే ఇంట్లో పెరుగుతున్న పిల్లల వ్యక్తిత్వం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఒకే విధంగా ప్రవర్తించరు కూడా. చూడటానికి ఒకే పోలికలతో ఉన్నా, ఒకే విధంగా ఆలోచన చేస్తున్నా ఆలోచనలో మార్పు, వారి వ్యక్తిత్వం పూర్తి భిన్నంగా ఉంటుంది. అలా మీ వ్యక్తిత్వం తెలిపే విషయాలలో మీ కాలిపాదాలు ఒకటి. మీ వ్యక్తిత్వం ఏంటో మీరే మీ పాదాలను బట్టి తెలుసుకోండి.

ఒక దాని వెనుక ఒకటి (ఈజిప్టియన్ పాదాలు)

సాధారణంగా అందరికీ ఈ విధంగానే ఉంటాయి. బొటన వేలు పెద్దదిగా ఉండి, ఆ వెనుక అన్ని చిన్న సైజులో ఉండటం జరుగుతుంది. ఇలాంటి వారు రహస్యాలను తెలుసుకోవడానికి, మిస్టరీగా మారిన విషయాలు కనిపెట్టడానికి ఇష్టపడటం చేస్తుంటారు. అలాగే తమలో ఉన్న ఆలోచనలను త్వరగా ఎవరితోనూ బయటకు చెప్పుకోరు. వీరు నమ్మదగిన వారు అనిపిస్తేనే తమ సీక్రెట్స్ బయటకు చెబుతారు. ఇలా ఉంటే ఈజిప్టియన్ అడుగులు అని అంటారు.

మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉంటే (రోమన్ అడుగులు)

మొదటి మూడు వేళ్ళు ఒకే విధంగా సమానంగా ఉండి, మిగతా రెండు వేళ్ళు తక్కువ సైజులో ఉంటే రోమన్ అడుగులు అని అంటారు. వీరు చాలా ఆకర్షణీయమైన వారు, నమ్మదగిన వారు మరియు నమ్మకస్తులు. ఒకసారి తమ అనిపిస్తే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. స్నేహం, ప్రేమ, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

అన్ని వేళ్ళు ఒకే విధంగా (పర్షియన్ అడుగులు)

ఇలా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటాయి. బొటన వేలు నుండి చివరి వేలు వరకు అన్నీ వేళ్ళు ఒకే సైజులో ఉంటాయి. వీటినే పర్షియన్ ఫూట్ అని అంటారు. వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అనవసరపు విషయాలలో వేలు పెట్టకుండా కామ్ గా ఉంటారు. సమస్య వచ్చినప్పుడే ముందుకు వెళ్లడం జరుగుతుంది కానీ అంతకుముందు పట్టించుకోరు. ఇతరులు చెప్పే నిర్ణయాలపై ఎక్కువ ఆధారపడతారు కానీ చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికే ఫిక్స్ అవుతారు.

రెండవ వేలు పొడవుగా ఉంటే (గ్రీక్ ఫూట్)

బొటన వేలు కన్నా రెండవ వేలు పొడవుగా మిగతా మూడు వేళ్ళు మాములుగా ఉంటే గ్రీక్ ఫూట్ అని పిలుస్తారు. ఇటువంటి వారికి క్రియేటివిటీగా ఆలోచించడం, సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. ఎటువంటి సమస్య అయినా సరే సులభమైన పరిష్కారం ఇస్తారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కాస్త ఎక్కువ. తను ముందుండి ఇతరులను నడిపించే స్వభావం.

స్థిరంగా ఉండే చివరి వేళ్ళు

సాధారణంగా అడుగు వేస్తున్నప్పుడు వేళ్ళు కదలడం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరిలో చివరి రెండు వేళ్ళు అలాగే స్థిరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు పనికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేంత వరకు వారు ఇతర విషయాలు గురించి అస్సలు పట్టించుకోరు.

సపరేట్ గా ఉండే చివరి వేలు

మీరు బాగా గమనించినట్లయితే కొందరిలో చిట్ట చివరి వేలు ఇతర వేళ్ళకు చాలా దూరంగా ఉండి కదులుతూ ఉంటుంది. వీళ్ళు చాలా చురుకు (ఆక్టివ్) గా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి మరియు పరిశోధనలు బాగా చేస్తుంటారు. అలాగే సాహసాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకేచోట కుదురుగా కూర్చోవడం అంటే వీరికి ఇష్టం ఉండదు.

కిందకు ఉండే చివరి వేలు

మిగతా వేళ్ళతో పోల్చితే రెండు పాదాలలోనూ చివరి వేలు కిందకు అణిగిపోయి ఉన్నట్లుగా, కనిపించనట్లుగా ఉంటుంది. ఇలాంటివారు ఒకరు నడిచిన దారిలో నడవడం కన్నా కొత్తగా ఆలోచించి ట్రెండ్ సెట్ చేసే టైప్ అన్నమాట. వీరి వ్యక్తిత్వం, వీరి ఆలోచన తీరు కొన్నిసార్లు ఇబ్బందిపెట్టినా త్వరగా విజయవంతం అవుతారు మరియు మంచి పేరు కూడా వస్తుంది.

ఇలా మీలో ఎవరికైనా ఉంటే COMMENT చేయండి. మీ ఫ్రెండ్స్ కు తెలిసేలా SHARE చేయండి.    

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon