Link copied!
Sign in / Sign up
2
Shares

మీ నవ్వు, మీరు నవ్వే విధానాన్ని బట్టి మీరు ఎలాంటివారో ఈజీగా తెలుసుకోవచ్చు..

నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగమని అన్నారు ఒక పెద్ద కవి.. నిజమే నవ్వు లేకపోతే జీవితంలో సంతోషం, ఆనందం అనేవి కరువయ్యేవి. నవ్వడం వలన మన శరీరం చాలా ఉత్తేజితమవుతుంది, ఎంతో ఆక్టివ్ గా పనిచేయగలరు, ప్రతి యొక్క విషయంపై ఏకాగ్రతను పెంచుకోగలరు. కానీ కొంతమంది మాత్రం తమ ముందు ఎంత తమాషా జరుగుతున్నా సరే అస్సలు పట్టించుకోరు, నవ్వడం కూడా చేయరు. అందుకే ఇక్కడ మీ నవ్వును బట్టి, మీరు నవ్వే విధానాన్ని బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోవచ్చు. చాలామంది అభిప్రాయాల మేరకు, వారి నవ్వును బట్టి చెప్పిన విషయాలు ఇవి..

పెదాలు విప్పివిప్పనట్లుగా..

పదిమంది ఎంతో ఆనందంగా, గట్టిగా నవ్వుతున్నప్పుడు మీరు నవ్వకుండా కేవలం మీ పెదాలను తెరిచితెరవనట్లుగా ఉంటే అందరితోపాటు ఉండటం అంటే మీకు కాస్త భయం. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ రహస్యాలను అందరితో చెప్పుకోవాలంటే బాగా ఆలోచిస్తారు. సిగ్గు ఎక్కువ. 

గట్టిగా నవ్వితే..

కొందరు ఎవరున్నా సరే తమకు నవ్వు తెప్పించే సంఘటనలు జరిగినా లేదా ఏదైనా విషయం గుర్తొచ్చినా సరే బిగ్గరగా నవ్వడం చేస్తారు. వీరు ఏ విషయాన్ని మనస్సులో దాచుకోకుండా అందరితో పంచుకుంటారు, కష్టపడేతత్వం ఎక్కువ, ఒకరి గురించి వారు లేనప్పుడు చెడుగా మాట్లాడటం వారికి ఇష్టం ఉండదు, అందరితో కలిసి ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం.

ఫేక్ స్మైల్ 

నవ్వు రాకపోయినా సరే కొందరు ఎదుటివాళ్ళు ఫీలవుతారో లేదా ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు చిన్నగా స్మైల్ ఇచ్చి వదిలేస్తారు. ఇటువంటివాళ్లకు ఓపిక తక్కువ, అనవసర విషయాలకు చాలా దూరంగా ఉంటారు, పక్కవారి సంతోషం కోసం ఇష్టంలేకపోయినా సరే అని సర్దుకుపోయే రకం. మనస్సులో విషయాలను త్వరగా బయటకు చెప్పలేరు. 

నీరసమైన నవ్వు 

ఇవి చాలా తక్కువమందిలో కనిపిస్తుంటుంది. నవ్వాలనిపించినా నవ్వడానికి భయపడుతూ ఉంటారు. దీనికి ఏం నవ్వుతాం లే.. ఇందులో నవ్వడానికి ఏముందని వదిలేస్తుంటారు. ఇటువంటివారు ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూడకుండా సాధారణంగా ఉంటారు. ప్రతి దానికీ ఆరాటపడకుండా, ఆత్రం చెందకుండా, నెమ్మదిగా నిదానంగా చేసుకుంటూ వెళతారు. ఆలస్యమైనా సక్సెస్ ను సొంతం చేసుకుంటారు. 

అందమైన చిరునవ్వు 

ఇవి చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. మనస్సుకు నచ్చిన విషయాన్ని పదిమంది ముందు ఒప్పుకోవడం వీరికి ఇష్టం, ఎటువంటి ఇగో ఉండదు, సక్సెస్ సాధించింది తన శత్రువైనా సరే మనస్ఫూర్తిగా అభినందిస్తారు. మనస్సులో ఏదీ దాచుకోరు, కష్టపడేతత్వం ఎక్కువ, వీరు చేసే పని తమ కోసమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా చేస్తారు. 

మీ నవ్వు ఇందులో ఎలా ఉంటుంది, పైన చెప్పుకున్న విషయాలు మీకు నచ్చినట్లు ఐతే కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి..

Image Source : Suryan FM

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon